Kalki2898AD : దీపిక చేయి పట్టుకున్న ప్రభాస్… అమితాబ్ ఏం చేశారంటే?

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి2898AD ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. మొన్నటివరకూ టీజర్, సాంగ్స్ అంటూ, అలాగే మేకింగ్ వీడియోలతో సందడి చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఆడియన్స్ తో నేరుగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. క ఈ ప్రమోషన్లు ముంబై నుండే అఫిషియల్ గా మొదలు పెట్టడం జరిగింది. ఇక ఈ రోజు ముంబై లో నోవాటెల్ లో రానా హోస్ట్ గా జరిగిన కల్కి ప్రమోషనల్ ప్రెస్ మీట్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ ప్రధాన తారాగణం అయిన ప్రభాస్, దీపికా పదుకొనె తో పాటు లెజెండరి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు కూడా పాల్గొనడం జరిగింది. ఇక రానా హోస్ట్ గా జరిగిన ఈ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ కల్కి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని ప్రస్తావించడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో ఓ సందర్భంలో గమ్మత్తు జరిగింది. దీపికా చేయిపట్టుకున్నాడు ప్రభాస్, అప్పుడు ప్రభాస్ ని అమితాబ్ పట్టుకోవడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

Prabhas holding Deepika Padukone's hand at the pre-release event of Kalki2898AD

దీపికా చేయిపట్టుకున్న ప్రభాస్.. ఎందుకంటే?

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా దగ్గుబాటి రానా వ్యవహరించగా, స్టార్ నటీనటులను ఆడియో విజువల్ ప్రొమోను ప్రదర్శించి స్టేజీ మీదకు ఆహ్వానించారు. ఈ క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ప్రస్తుతం దీపికా పదుకొనె గర్భవతి అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె మెల్లిగా స్టేజీపైకి నడుచుకుంటూ వచ్చారు. మూవీ గురించి మాట్లాడిన తరువాత స్టేజీ పై నుంచి మెల్లిగా కిందకు దిగుతున్నారు. ఈ సమయంలో ప్రభాస్ వచ్చి ఆమెకు సాయం చేశాడు. ఆమె చేతిని పట్టుకుని మెల్లిగా నడిపించే ప్రయత్నం చేయగా.. ప్రభాస్ వెనకే వచ్చిన అమితాబ్ బచ్చన్ ప్రభాస్‌ను పక్కకు జరిపి ఆమె చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భం సరదాగా సాగింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అవుతున్నాయి.

- Advertisement -

కల్కి పై భారీ ప్రమోషన్!

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో దీపిక పదుకోనె, దిశా పటాని హీరోయిన్లుగా నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్‌, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ ప్రతిష్టాత్మక కీలక పాత్రల్లో నటించగా, వీళ్ళతో పాటు పలువురు యంగ్ స్టార్లు ఈ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారు. ఇక కల్కి (Kalki2898AD) సినిమా జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ముందుగా ముంబై లో హిందీ ప్రమోషన్లతో మొదలు పెట్టి, ఆ తర్వాత వరుసగా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ ఏరియాల్లో ప్రమోట్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు