Kalki2898AD : అమితాబ్ వేసుకున్న టీ షర్ట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే…

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా ప్రమోషన్లు గ్రాండ్ గా మొదలైపోయాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో డైరెక్ట్ గా ముంబై నుండే ప్రమోషన్లు స్టార్ట్ చేసారు చిత్ర యూనిట్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి2898AD సినిమా కోసం ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగులో బుజ్జిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎప్పుడో ప్రమోషన్లు మొదలు పెట్టేయగా, ఇక ఈ చిత్ర నిర్మాతలు సినిమాపై ఇతర భాషల్లోనూ ఆసక్తిని పెంచేందుకు శక్తి మేరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిన్న అనగా జూన్ 19న కల్కి మేకర్స్ ముంబైలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్‌ తో పాటు లెజెండరీ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, అలాగే హీరోయిన్ దీపికా పదుకొనే కూడా హాజరయ్యారు. ఇక ముంబైలో నోవాటెల్ లో జరిగిన ఈ ఈవెంట్ ని స్వయంగా దగ్గుపాటి రానా హోస్ట్ గా చేయడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో స్టైలిష్ టీషర్ట్ తో బిగ్ బి అమితాబ్ హైలెట్ గా నిలిచారు.

Amitabh Bachchan in hoodie t-shirt at Kalki2898AD pre release event Do you know the value?

బిగ్ బి వేసుకున్న టీషర్ట్ వ్యాల్యూ తెలుసా?

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరూ సింపుల్ అండ్ స్టైలిష్ గా, బ్లాక్ & వైట్ కాంబినేషన్ డ్రెస్ లో హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్ చాలా సింపుల్ గా బ్లాక్ షర్ట్ వేసుకుంటే బిగ్ బి అమితాబ్ మాత్రం చాలా స్టైలిష్ గా టీషర్ట్ తో కనిపించారు. ఇక ఈ టీషర్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ హుడి టీషర్ట్ వ్యాల్యూ తెలిసిన వాళ్ళు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఈహుడి టీషర్ట్ విలువ ఏకంగా 795 డాలర్లు గా ఉంది.. అంటే ఇండియన్ కరెన్సీ లో అక్షరాలా 70,755 రూపాయలు…
ఇక నిన్నటినుండి ఈ టీషర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 80ఏళ్ళ వయసులోనూ అమితాబ్ తెగ సందడి చేసారు. పైగా చాలా రోజుల తర్వాత అమితాబ్ బచ్చన్ ఒక పవర్ ఫుల్ రోల్ లో నటించారని చెప్పొచ్చు.

- Advertisement -

అశ్వద్ధామగా అమితాబ్…

ఇక కల్కి2898AD మూవీలో ప్రభాస్ భైరవగా నటించగా, కల్కిగా క్లైమాక్స్ లో కనిపిస్తాడని సమాచారం. అలాగే అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో పురాణాల్లో సప్త చిరంజీవుల్లో ఒకరైన అశ్వద్ధామ పాత్రలో కనిపిస్తున్నారు. ఇక అమితాబ్ కి సంబంధించిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో కొన్ని షాట్స్ లో ప్రభాస్ ని డామినేట్ చేసేలా ఉన్నారు. ఇక అమితాబ్ బచ్చన్ అభిమానులకి కల్కి ఓ రేంజ్ లో నచ్చే అవకాశం ఉంది. ఇక కల్కి సినిమా ప్రమోషన్లు ఇప్పటికే పీక్స్ కి చేరుకోగా, రేపో, ఎల్లుండో తమిళ్, మలయాళం, కన్నడ నాట కూడా ఈవెంట్ లు గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఇక కల్కి2898AD రిలీజ్ కి ఇంకా వారం రోజులే ఉంది. పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ గా జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు