HBD Klinkaara: తల్లిదండ్రులకే కాదు తాతలకు కూడా కలిసొచ్చిన క్లీంకారా..!

HBD Klinkaara..నేడు మెగా వారసురాలు క్లీంకారా పుట్టినరోజు.. ఇక ఫస్ట్ బర్తడే సందర్భంగా రామ్ చరణ్ ఉపాసన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. గత సంవత్సరం జూన్ 20వ తేదీన మెగా ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెట్టింది.. క్లీంకారా రాకతో మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి.. మెగా అభిమానులు కూడా పండగ చేసుకున్నారు.. అయితే క్లీంకారా మెగా కుటుంబంలోకి అడుగుపెట్టడం వల్ల వారికి ఆనందంతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చిందనే చెప్పాలి.. అటు తల్లిదండ్రులకే కాదు ఇటు తాతలకి కూడా బాగా కలిసి వచ్చింది అనడంలో సందేహం లేదు..

తాతలకు పెరిగిన అదృష్టం..

HBD Klinkaara: Klinkaara not only for parents but also for grandparents..!
HBD Klinkaara: Klinkaara not only for parents but also for grandparents..!

అసలు విషయంలోకి వెళ్తే.. క్లీంకారా పుట్టిన తర్వాత రామ్ చరణ్ కు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల గౌరవ పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నారు.. మరొకవైపు ఉపాసన కూడా తన అపోలో హాస్పిటల్స్ లో మెరుగైన అభివృద్ధి కనబరిచి.. అరుదైన గౌరవాలను అందుకుంది.. ఇక ఇవే కాకుండా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించబడ్డారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 13 సంవత్సరాల పాటు అధికారం కోసం ఎదురు చూడగా.. ఎట్టకేలకు ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాదు.. ఏకంగా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. అలాగే వరుణ్ తేజ్ కూడా దాదాపు నాలుగు ఐదు సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోలేక.. ఒంటరి అయ్యారు.. కానీ ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్లో ప్రముఖ హీరోయిన్.. తాను ప్రేమించిన అమ్మాయి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకొని తన జీవితంలో కూడా వెలుగులు నింపుకున్నారు .. ఇలా తమ కుటుంబంలోకి క్లీంకారా వచ్చిన తర్వాతనే ఈ అదృష్టమంతా కలిసొచ్చింది అంటూ మెగా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

ఇప్పటికైనా పాప ముఖాన్ని చూపిస్తారా..

ఇదిలా ఉండగా మెగా కుటుంబానికి ఇంత అదృష్టాన్ని తెచ్చి పెట్టిన ఈ చిన్నారి ముఖాన్ని ఇప్పటివరకు కూడా చూపించలేదు.. పలుమార్లు క్లీంకారా ఫోటోలు బయటకు వచ్చినా.. ప్రతిసారి కూడా ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు మెగా కుటుంబ సభ్యులు. ఇక క్లీంకారా పుట్టి నేటికి ఏడాది పూర్తయింది.. కనీసం ఇప్పుడైనా ఈ పాప ముఖాన్ని పూర్తిగా అభిమానులకు చూపిస్తారా? లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

ఎమోషనల్ అయినా ఉపాసన – రామ్ చరణ్:

ఇలా ఉండగా మరొకవైపు తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఉపాసన ఒక ఎమోషనల్ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.. ఈ వీడియోలో చరణ్, ఉపాసన ఇద్దరూ కూడా.. ఉపాసనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంతవరకు ఎలా ఫీలయ్యారు.. చెబుతూ ఎమోషనల్ అయ్యారు.. చాలామంది పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టడం లేదని ఎన్నో రకాలుగా అడిగారు.. ఆ బాధలన్నీ దిగమింగుకున్నాము.. ఇక పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత పాప పుట్టడం అందరికీ హ్యాపీగా ఉంది.. తనని ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు మర్చిపోలేని అనుభూతి.. తాను పుట్టినప్పుడు అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు అంటూ చెబుతూ ఏడ్చేశారు చరణ్ – ఉపాసన.. అలాగే ఉపాసన ప్రెగ్నెన్సీ నుంచి పాప పుట్టి బారసాల అయ్యి.. పేరు అనౌన్స్ చేసే వరకు కూడా విజువల్స్ గా చూపించారు.. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ గా మారుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు