Kalki2898AD : దత్‌కి టీడీపీ అంటే మరీ ఇంత పిచ్చా..? ముంబైలోనూ..

Kalki2898AD : టాలీవుడ్ లో మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్ సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా పిచ్చెక్కించే హైప్ తో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన మేకింగ్ వీడియోలు, ట్రైలర్స్ సహా అన్నీ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెంచేసాయి. ఇక నిన్నటి నుండి అఫిషియల్ గా కల్కి ప్రమోషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన బెడితే ఇతర స్టేట్స్ లో, వేరే భాషల్లో కల్కి ప్రమోషన్లు తప్పనిసరి. ఎందుకంటే 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాకి భారీ ఓపెనింగ్స్ తప్పనిసరి. ఇక నిన్న అనగా జూన్ 19 బుధవారం నాడు కల్కి (Kalki2898AD) సినిమా ప్రమోషనల్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దగ్గుపాటి రానా హోస్ట్ గా నిర్వహించిన ఈ ఈవెంట్ కి ప్రభాస్ సహా, లెజెండరీ నటులు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు హాజరయ్యారు. ఇక హీరోయిన్ దీపికా పదుకొనె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికి సినిమా ప్రమోషన్లకి హాజరవడం విశేషం. అలాగే చిత్ర నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ కూడా ఈవెంట్ లో పాల్గొన్నాడు. అయితే ఇక్కడ అశ్వినీదత్ విషయంలో నెట్టింట టాపిక్ వైరల్ అవుతుంది.

Ashwini Dutt in yellow shirt at Kalki2898AD pre release event

దత్‌కి టీడీపీ అంటే మరీ ఇంత పిచ్చా?

ఇక ముంబై లో జరిగిన కల్కి ప్రమోషనల్ ఈవెంట్ లో చిత్ర నటీనటులు సహా, మూవీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కి అశ్వినీదత్ యెల్లో షర్ట్ వేసుకుని రావడం జరిగింది. ఆ షర్ట్ పై టాలీవుడ్ నెట్టింట చర్చ నడుస్తుంది. అదేంటి అయితే ప్రభాస్ షర్ట్ పైనే లేక దీపికా డ్రెస్ గురించో చర్చ జరగాలి గాని.. అశ్విని దత్ షర్ట్ పై అంత మాట్లాడుకోవాల్సిన విషయం ఏముంది అంటారా? అక్కడే ఉంది అసలు విషయం. అశ్వినీదత్ వేసుకొచ్చింది యెల్లో షర్ట్… అశ్వినీదత్ నందమూరి తారకరామారావు కి వీరాభిమాని అని తెలిసిందే. ఎంతంటే ఆయన వైజయంతి పిక్చర్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడిగా ఉన్న బొమ్మ వేసుకున్నారు. అలాగే ఎన్టీఆర్ టిడిపి పెట్టినప్పటినుండి ఆ పార్టీ కి కూడా ఫ్యాన్. అలాగే చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు అశ్వినీదత్. టిడిపి పార్టీ కి ఎన్నో సమయాల్లో వెనకుండి సపోర్ట్ చేసిన వాళ్లలో అశ్విని దత్ కూడా ఒకరు. ఇక ఇప్పుడు మళ్ళీ టిడిపి అధికారంలోకి రాగానే సినిమా ఇండస్ట్రీ నుండి అశ్వినిదత్ వైరల్ అవుతున్నాడు.

- Advertisement -

టిడిపి అభిమానాన్ని చాటుకున్న అశ్వినిదత్…

ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో రీసెంట్ గా రెండు నెలల కింద ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల్లో ఊహించని రేంజ్ లో టిడిపి పార్టీ గెలిచి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటయింది. అయితే అసలు ఏపీలో ఎన్నికల జరగక ముందు… అందరూ మళ్లీ వైసీపీ గెలుస్తుంది అని అనుకున్న టైంలో, ధైర్యంతో టీడీపీనే గెలుస్తుంది అంటూ అశ్విని దత్ కామెంట్స్ చేశాడు. అనుకున్నట్టుగానే టిడిపి భారీ మెజార్టీ తో గెలిచి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటయింది. ఇక టీడీపీ గెలిచిన తర్వాత టాలీవుడ్ నుండి మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అశ్వినీ దత్ అని సోషల్ మీడియాలో వచ్చాయి. ఈ తరుణం లో పార్టీ గుర్తులా టిడిపి పార్టీ ని గుర్తు చేస్తూ అశ్వినీదత్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యెల్లో షర్ట్ లో రావడం జరిగింది. ఇక ఇది గమనించిన తెలుగు నెటిజన్లు అశ్వినిదత్ కి టిడిపి అంటే మరీ ఇంత పిచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కల్కి2898AD సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ హైక్ ని కూడా పెంచి గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు