Bollywood Hero: కుక్కలకు రూ.45 కోట్లు రాసిచ్చిన హీరో.. ఆమెతో ఎఫైర్ కూడా..!

Bollywood Hero.. జంతు ప్రేమికులు సాధారణంగా ఎక్కడ చూసినా ఉంటారు.. అయితే వారి గురించి పెద్దగా తెలియదు.. కానీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా బాలీవుడ్ లో జంతు ప్రేమికులు చాలామంది ఉన్నారు. వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది కూడా..చాలామంది కళాకారులు అందమైన కుక్కలను తమతో ఉంచుకుంటున్నారు.. కుక్కల వల్ల ఒత్తిడి తగ్గుతుందని.. మానసిక ఆనందం పెరుగుతుందని కూడా చెబుతున్నారు.. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ కుక్కలను పెంచని వారంటూ ఎవరూ లేరు… అందులో సెలబ్రిటీల చేతుల్లో పెరిగే కుక్కలకు రాజభోగాలు కూడా తప్పవు.. అయితే సాధారణంగా ఎవరింట్లో అయినా సరే ఒకటి లేదా రెండు కుక్కలు ఉంటాయి.. బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో అయితే మహా అంటే ఒక పది కుక్కలు వుంటాయి. కానీ ఒక బాలీవుడ్ స్టార్ హీరో దగ్గర ఏకంగా 116 కుక్కలు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

116 కుక్కలకు రూ.45 కోట్ల ఆస్తి..

Bollywood Hero: The hero who wrote Rs. 45 crores for dogs.. also had an affair with her..!
Bollywood Hero: The hero who wrote Rs. 45 crores for dogs.. also had an affair with her..!

ఆ హీరో ఎవరో కాదు మిథున్ చక్రవర్తి.. ఈయన డాగ్ లవర్ అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది.. మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ అందరికీ తెలిసిందే.. కానీ ఆయన ఇంత పెద్ద డాగ్ లవర్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ముఖ్యంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో తన వివిధ ఆస్తులలో 116 కుక్కలను ఆయన కలిగి ఉన్నారు. ఇక తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం ముంబై సమీపంలోని మడ్ ఐలాండ్ లో తన 1.5 ఎకరాల ఆస్తిలో 76 కుక్కలను పెంచుతున్నారు.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కుక్కల కోసం కేటాయించిన ఆస్తి విలువ దాదాపు రూ.46 కోట్లు ఉంటుందట.. అంతేకాదు ఇందులో ఆయన వ్యక్తిగత నివాసం కూడా ఉంది.. ఈ నివాసాన్ని తన కుక్కల కోసం కేటాయించినట్లు సమాచారం.

కుక్కల కోసం ప్రత్యేక శిక్షణ..

అంతేకాదు మిథున్ తన స్నేహితులైన కుక్కల కోసం కెన్నెల్స్, ప్లే గ్రౌండ్ లను ఏర్పాటు చేశాడు.. కుక్కలకు కావలసిన అన్ని ఆధునిక సౌకర్యాలను కూడా ఆయన సమకూర్చినట్లు సమాచారం.. ఇక ఇదిలా ఉండగా మిథున్ చక్రవర్తి కోడలు నటి మదాల్సా శర్మ.. గతేడాది ఒక ఇంటర్వ్యూలో కుక్కల గురించి మాట్లాడింది.. తన ఇంట్లో కుక్కల కోసం ప్రత్యేక గదులు ఉన్నాయని.. వాటి సంరక్షణ కోసం సిబ్బందిని కూడా నియమించామని.. కుక్కలను తమ సొంత పిల్లల్లాగా చూసుకుంటామని వాటి సంరక్షణకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం అవుతారని.. ఈ విషయంలో నిజం చాలా జాగ్రత్తలు తీసుకుంటారని ఆమె వెల్లడించింది.

- Advertisement -

రూ.400 కోట్ల ప్రాపర్టీ..

ఇక మిథున్ చక్రవర్తి విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి రావడానికి అవకాశాల కోసం వెతుకులాటలో రైల్వే స్టేషన్ ఫుట్ పాత్ లపై నిద్రపోయి ఈ స్థాయికి ఎదిగారు. బాలీవుడ్లో స్టార్ హీరో మాత్రమే కాదు తెలుగులో కూడా గోపాల గోపాల సినిమాలో మెయిన్ విలన్ గా నటించి మెప్పించారు… ఇక ఈయన ఆస్తి రూ.400 కోట్లకు పై మాటే.. ఊటీ లో మడ్ ఐలాండ్లో మిథున్ కి ఇల్లు కూడా ఉంది. అనేక హోటల్స్ కాలేజీలకు యజమాని కూడా.. ముంబై తో పాటు మైసూర్ లో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

శ్రీదేవి తో పెళ్లి కూడా..

ఇక ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. యోగిత బాలిని అనే ఆమెను వివాహం చేసుకున్న తర్వాత శ్రీదేవిని కూడా వివాహం చేసుకున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. ఇకపోతే ఈయనకు నలుగురు పిల్లలు ఉండగా.. చెత్తకుండీలో పడి ఉన్న మరో చిన్నారిని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు