Kalki 2898AD : కల్కి సెకండ్ ట్రైలర్ లీక్.. ఆ ఇద్దరి యాక్షన్ సీన్స్ హైలెట్..

Kalki 2898AD : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’.. ఈ సినిమాకు జనాల్లో ఏ రేంజులో రెస్పాన్స్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడానికి మేకర్స్ వదిలిన అప్డేట్స్ కు రెస్పాన్స్ భారీగానే వచ్చింది.. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటుగా, సినీ అభిమానులు సినిమాను స్క్రీన్ మీద చూసేందుకు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.. తాజాగా ఈ సినిమా సెకండ్ ట్రైలర్ సీన్స్ సోషల్ మీడియాలో లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

ఈ సినిమాకు మూడు ఈవెంట్ లను నిర్వహించాలని మేకర్స్ ముందుగానే అనుకున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ముంబైలో నిన్న రాత్రి జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె సహా నిర్మాత అశ్వినీదత్ కూడా హాజరయ్యారు..సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఈవెంట్ లో ట్రైలర్ ను కొంచెం చూపించారు.. దీన్ని ఫోన్లో రికార్డు చెయ్యకుండా జాగ్రత్త పడినా కూడా లీక్ అయ్యింది..

kalki second trailer leak photos viral
kalki second trailer leak photos viral

అయితే ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ సెకండ ట్రైలర్‌కి సంబంధించిన వీడియోల్లో విజువల్స్ మాములుగా లేవు. ముఖ్యంగా ఫస్ట్ ట్రైలర్‌లో ఎక్కడా చూపించని కొన్ని సీన్లు, కొత్త క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా సెకండ్ ట్రైలర్‌లో కనిపించింది. మృణాల్ కడుపులోకి ఒక లైట్ దూసుకొస్తున్న విజువల్ చూడటానికి అదిరిపోయింది.. ఆ సీన్ లో అమితాబ్ మృణాల్ మధ్య జరిగిన విజువల్స్ మొత్తానికి అదిరిపోయాయి.. ఈ లీక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కొద్దీ రోజుల్లో సినిమా విడుదల కాబోతుంటే ఇప్పుడు టీమ్ ఇలా చెయ్యడం ఎందుకని మండిపడుతున్నారు. దీనిపై టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఈ సినిమా మొదటి టిక్కెట్ ను అమితాబ్ కొన్న సంగతి తెలిసిందే .. ఆ టికెట్ ను కమల్ హాసన్ కు గిఫ్ట్ గా ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు