OTT Movie : గతం మర్చిపోయిన అమ్మాయితో భర్తను అని చెప్పి కాపురం… ఈ థ్రిల్లర్ సినిమాలకు బాబు ఈ సైకో మూవీ

OTT Movie : సైకో కిల్లర్ మూవీస్ ఇప్పటిదాకా చాలానే చూసాం మనం. సైకో కిల్లర్ ప్రేమలో పేరుతో అమ్మాయిని వేయించుకు తినడం, లేదా అమ్మాయిలను టార్గెట్ చేసి చంపడం వంటి కథ, కథనంతో వచ్చిన సినిమాలు ఎన్నో ఓటీటీలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా సైకో సినిమానే. కానీ ఈ థ్రిల్లర్ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీడీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ సైకో థ్రిల్లర్ జానర్ కు సంబంధించింది. ఈ మూవీ పేరు సీక్రెట్ ఆబ్సెషన్. ఓ అబ్బాయి అమ్మాయి ప్రేమ కోసం ఏం చేశాడు అనే అంశమే ఈ మూవీ. అనుక్షణం థ్రిల్లింగ్ గా సాగే ఈ ప్రేమ కథను చివరి వరకు ఇంట్రెస్టింగ్ గా మలచడంలో డైరెక్టర్ పీటర్ సల్లివాన్ సక్సెస్ అయ్యాడు. నటీనటులు కూడా అద్భుతంగా నటించారు. ఈ వీకెండ్ మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉన్న సినిమాను చూడాలి అనుకునే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. ఇక సీక్రెట్ ఆబ్సేషన్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

There's A New Netflix Movie Called "Secret Obsession" That People Either Really Enjoyed Or Strongly Disliked, So I Watched And Here's How It Is

- Advertisement -

కథలోకి వెళ్తే…

జెన్నిఫర్ అనే అమ్మాయి సడన్ గా ఒక కార్ యాక్సిడెంట్ కు గురవుతుంది. దీంతో ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అయితే ఆమె భర్త రాయన్ తనను చూడడానికి హాస్పిటల్ కి వస్తాడు. అతనికి జెన్నిఫర్ గతాన్ని మర్చిపోయిందనే విషయాన్ని డాక్టర్లు చెప్తారు. ఆ వ్యక్తి వెళ్లి జెన్నిఫర్ కు నేను నీ భర్తను అని చెప్పి పరిచయం చేసుకుంటాడు. ఆమెను ఇక ఇంటికి తీసుకెళ్లొచ్చు అని డాక్టర్స్ చెప్పగానే కార్లో ఇంటికి తీసుకెళ్తాడు. ఓ పెద్ద బంగ్లాలోకి తీసుకెళ్లి ఇది మన ఇళ్లే అని చెప్పి తెగ ప్రేమను చూపిస్తాడు. మరోవైపు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న డిటెక్టివ్ ప్రాంక్ కు ఇది యాక్సిడెంట్ కాదని అర్థమవుతుంది. జెన్నిఫర్ రయాన్ ఇంటికి వెళ్లిన రోజే ఫ్రాంక్ అతనికి ఫోన్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ స్టేషన్ కి రమ్మంటే వస్తానని చెప్పి రాయన్ తప్పించుకోవడంతో అతనికి మరింత అనుమానం వస్తుంది.

ఇక మరోవైపు రాయన్ తో కలిసి ఇంటికి వెళ్ళినప్పటికి జెన్నిఫర్ కి అతనిపై అనుమానం వచ్చి దూరం పెట్టేస్తుంది. ఇక ఈ సైకో ఆమె బెడ్రూంలో కెమెరాలు పెట్టి మరీ జెన్నిఫర్ ను గమనిస్తాడు. ఈ నేపథ్యంలోనే రాయన్ జెన్నీఫర్ భర్త కాదనే విషయాన్ని ఫ్రాంక్ కనిపెడతాడు. అదే సమయంలో జెన్నిఫర్ కి కూడా అతను తన భర్త కాదన్న విషయంపై క్లారిటీ వస్తుంది. మరి వీరిద్దరూ రాయన్ గురించి ఎలా తెలుసుకున్నారు? తన భర్త అతను తెలిసిన తర్వాత జెన్నీఫర్ ఏం చేసింది? ట్రయాన్ ఎందుకు జెన్నిఫర్ దగ్గర అబద్ధం చెప్పాడు? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ మూవీపై ఓ లుక్కెయ్యండి. కచ్చితంగా వర్త్ వాచింగ్ మూవీ అంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు