10YearsForOohaluGusagusalaade : ప్రభావతి బీచ్ కి వెళ్లి 10 ఏళ్లయింది, దీనితో ఆ అవకాశం కోల్పోయింది

10YearsForOohaluGusagusalaade : తెలుగు చలనచిత్ర సీమ లో రోజూ ఎన్నో చిత్రాలు వస్తుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే హిట్ అవుతాయి. వాటిలోనూ చాలా తక్కువ సినిమాలు మాత్రమే క్లాసిక్స్ గా పిలవబడతాయి. అలాంటి ఎవర్గ్రీన్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన కల్ట్ క్లాసిక్ “ఊహలు గుసగుసలాడే”. ఒక చిన్న సినిమాగా విడుదలై అశేష ప్రేక్షకాదరణ తో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టెలివిజన్ లో స్ట్రీమింగ్ అవుతుంటే చూపుతిప్పని ప్రేక్షకులుంటారు. ఇక టాలీవుడ్ లో రీ రిలీజ్ కావాలని కోరుకునే సినిమాల్లో ఇది కూడా ఉంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వ ప్రతిభ ఏంటో చెప్పడానికి ఈ ఒక్క చిత్రం చాలు. ఈ సినిమా ముగ్గురి టాలెంట్ లని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అదే దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్. హీరోహీరోయిన్లుగా నాగశౌర్య, రాశిఖన్నా. ఈ సినిమా జూన్ 20 2014లో విడుదలై అద్భుతమైన ప్రేక్షకాదరణతో ఘన విజయం సాధించి ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తైన సందర్బంగా ఈ చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం.

10Years For Oohalu Gusagusalaade Movie

ముక్కోణపు ప్రేమకథా చిత్రం…

ఊహలు గుసగుసలాడే చిత్రాన్ని దర్శకుడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్ అత్యద్భుతంగా తెరకెక్కించాడు. అప్పటికే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ లో అంత టాలెంటడ్ డైరెక్టర్ ఉన్నాడా అని ఈ సినిమాతోనే తెలిసింది. ‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’ పేరుతో ఆయ‌న తెర‌కెక్కించిన‌ మొద‌టి సినిమా. అయినా సరే అనుభవం ఉన్న దర్శకుడిలా అవలీలగా ఈ క్లాసిక్ ని తెరకెక్కించాడు. ప్యూర్ లవ్ & కామెడీ ఎంటర్టైనర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నాగ‌శౌర్య హీరోగా న‌టించ‌గా.. ఇదే మూవీతో రాశీ ఖ‌న్నా తెలుగులో క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చింది. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో నటించి ఆక‌ట్టుకున్నారు. ప్ర‌భావ‌తి, వెంకటేశ్వర్లు, ఉద‌య్ అనే మూడు పాత్ర‌ల‌ చుట్టూ తిరిగే ముక్కోణ‌పు ప్రేమ‌క‌థా చిత్ర‌మే.. ఈ ‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’ (10YearsForOohaluGusagusalaade). అలాగే ఈ చిత్రంలో రావు ర‌మేశ్, సూర్య‌, హేమ‌, ప్ర‌గ‌తి, స‌త్య‌కృష్ణ‌న్, పోసాని కృష్ణ‌ముర‌ళి ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించారు.

- Advertisement -

లీనమయ్యే కథా,కథనాలు…

మార్కెటింగ్ యాడ్స్ కు యాంకర్ గా పనిచేసే ఎన్ వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ (నాగ శౌర్య) న్యూస్ రీడర్ గా కావాలనే ఆశయంతో ఉంటాడు. అయితే తన బాస్ ఉదయ్ (అవసరాల శ్రీనివాస్) ప్రవర్తనతో టీవీ న్యూస్ రీడర్ కాలేకపోతాడు. అయితే పెళ్ళి చూపుల్లో తనకు నచ్చిన ఓ అమ్మాయిని మెప్పించడానికి వెంకీ సహకరిస్తే టీవీ న్యూస్ రీడర్ ను చేస్తానని ఉదయ్ ఒప్పుకుంటాడు. కాని గతంలో తను ప్రేమించి.. విడిపోయిన శ్రీ సాయి శిరీష ప్రభావతి (రాశి ఖన్నా) అలియాస్ ప్రభావతియే తన బాస్ పెళ్ళి చూపుల్లో చూసిందని తెలుసుకుంటాడు. బాస్ ఇష్టపడిన తన ప్రేయసిని వెంకీ దక్కించుకున్నారా? లేక ఉదయ్ పెళ్ళి చేసుకున్నారా? వెంకీ, ప్రభావతిలు అసలు ఎందుకు విడిపోయారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ ‘ఊహలు గుసగుసలాడే’.

కథ పరంగా చాలా సింపుల్ గా ఉన్నా, దాన్ని తన స్క్రీన్ ప్లే బలంతో, దర్శకత్వ ప్రతిభతో రక్తి కట్టించి అద్భుతంగా తెరకెక్కించాడు అవసరాల శ్రీనివాస్. ఇక క‌ళ్యాణి మాలిక్ సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. దానికి తోడు సిరివెన్నెల‌ సీతారామ‌శాస్త్రి, అనంత శ్రీ‌రామ్ సాహిత్యం వేరే లెవెల్ లో ఉంటుంది. పాట‌ల్లో “ఏం సందేహం లేదు” పాట అయితే చార్ట్ బ‌స్ట‌ర్ నిలిచింది. ఇక వారాహి చ‌ల‌న చిత్రం ప‌తాకంపై సాయి కొర్ర‌పాటి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జిని కొర్ర‌పాటి నిర్మించడం జరిగింది.

అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ‘సైరనో దె బెర్గెరాక్‌‌’ అన్న 19వ శతాబ్దపు ఫ్రెంచ్ నాటకాన్ని ఆధారంగా చేసుకుని పలు మార్పులతో తెరకెక్కించారు.ఇక ఈ సినిమాలో ఓ సందర్భంలో “హీరోకి బండి లేకున్నా హీరోయిన్‌ కి లిఫ్ట్ ఇస్తానంటే, ఆమె వద్ద బండి ఉన్నా లిఫ్ట్ తీసుకుంటానని చెప్పే సన్నివేశం “అనీ హాల్” సినిమా నుంచే కాపీ చేసారు. దర్శకుడు వూడి అలెన్ అభిమాని అయిన అవసరాల శ్రీనివాస్ ఆయన తీసిన అనీ హాల్ సినిమా నుండి ఆ సీన్ తీసుకున్నానని చెప్పాడు. ఇలాంటి అద్భుతమైన సీన్లు సినిమాలో కోకొల్లలు. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ చిన్న గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇందులో వెంకీ ని ఓ సందర్భంలో బీచ్ చూపించమని ప్రభావతి అడిగితే, నెక్స్ట్ డే తీసుకెల్తాడు. అక్కడ ప్రభావతి నా జీవితంలో బీచ్ కి రావడం ఇదే మొదటిసారి అని అంటుంది… సో మొదటిసారి బీచ్ కి రావడం ఎలా ఉంది అని వెంకీ అంటే… “బాధగా ఉంది” అంటూ.. ఇంకెప్పుడూ మొదటిసారి బీచ్ కి రాలేం కదా… అని అంటుంది. అంటే మొదటిసారి బీచ్ ని చూసిన ఆ ఆనందం ఇంకెప్పుడూ రాదు కదా అని చెప్పకనే చెప్పింది. ఇక్కడ దర్శక రచయితగా అవసరాల ప్రతిభని మెచ్చుకోవలసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు