Rajinikanth : రజినీకాంత్ ఫ్లాప్ సినిమాకి అరుదైన రికార్డ్.. ఎవరు ఊహించలేదుగా..?

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం ఏడు పదుల వయసు దాటినా కూడా ఇంకా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నారు.. ఇటీవల జైలర్ సినిమాతో అరుదైన రికార్డు అందుకున్న ఈయన.. ఇప్పుడు వెట్టయాన్ అనే సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాలా.. ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ అందుకుందో అందరికీ తెలిసిందే.. భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టు ఈ సినిమా ఫలితం కనిపించింది.. తమిళ్ లో కూడా యావరేజ్ గానే ఆడింది.. రిలీజ్ కి ముందు హడావిడి మామూలుగా లేదని చెప్పాలి.. కానీ రిలీజ్ అయిన తర్వాత ఆటంబాంబు కాస్త తుస్ మనింది. ముఖ్యంగా భాషా రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ఒకటే ప్రచారం కూడా సాగింది. కానీ మొదటి షో తోనే సత్తా చాటలేకపోయింది కాలా.

అరుదైన గౌరవం దక్కించుకున్న కాలా..

Rajinikanth : A rare record for Rajinikanth's flop movie.. who didn't expect it..?
Rajinikanth : A rare record for Rajinikanth’s flop movie.. who didn’t expect it..?

అయితే ఇప్పుడు ఈ డిజాస్టర్ మూవీకి ఒక అరుదైన గౌరవం లభించింది.. బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్లో 21వ శతాబ్దపు అద్భుతమైన 25 చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ మ్యాగజైన్లో స్థానం సంపాదించిన తొలి ఇండియన్ ఫిలిం గా రికార్డు సృష్టించింది కాలా. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినిమాలు ఈ జాబితాలో స్థానం కోసం పోటీ పడుతూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి మాత్రమే ఇలాంటి అరుదైన ఘనతలు లభిస్తాయి.. అందులో భారత్.. ముఖ్యంగా సౌత్ నుంచి తమిళ సినిమా ఎంపిక అవడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఓల్డ్ బోయ్ , గెట్ అవుట్ , ఆర్టిఫిషియల్ , ఇంటెర్ వర్షన్ లాంటి చిత్రాలు ఉన్నాయి..

25 చిత్రాలలో సౌత్ మూవీ ఒకటి..

2000 వ సంవత్సరం నుండి 2024 మధ్యలో వచ్చిన సినిమాలలో అన్ని విభాగాలను పరిశీలించి.. అత్యుత్తమ ప్రదర్శన కలిగిన 25 చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది. అందులో తమిళ్ నుంచి ఈ సినిమా సెలెక్ట్ అవ్వడం విశేషం. ఇకపోతే ఏడాదికి ఒక సినిమా చొప్పున తీసుకున్నామని కమిటీ తెలిపింది.. ఒక్కో విమర్శకుడు ఒక్కో సినిమాను ప్రతిపాదించినట్లు కూడా స్పష్టం చేశారు..

- Advertisement -

కాలా కథ..

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ముంబై మురికివాడ ప్రాంతం – రియల్ ఎస్టేట్ టైకూన్ మధ్య జరిగే స్టోరీ.. కథ బలంగా ఉన్న అంతే బలంగా తెరపై ఆవిష్కరించడంలో తప్పిదాలు దొర్లాయి.. అందుకే సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది . కానీ డైరెక్టర్ గనుక ఈ సినిమాను వేరే లెవెల్ లో తెరకెక్కించి ఉంటే కచ్చితంగా ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లు రాబట్టి ఉండేది.. ఇక డైరెక్షన్ విభాగంలోనే ఎక్కడో తప్పు జరిగి ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఏది ఏమైనా రజనీకాంత్ ఫ్లాప్ మూవీకి ఇలాంటి అరుదైన గౌరవం లభించడంతో అటు సినీ సెలబ్రిటీలు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు