5Years For Agent Sai Srinivasa Atreya : టాలెంట్ ఉంటే హీరో అయినట్టే… ఈ సినిమాతో నవీన్ చెప్పిందేటంటే..?

5Years For Agent Sai Srinivasa Atreya : టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వాళ్లలో సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్లు ఉన్నారు. మరి కొందరు ఇతర బిజినెస్ రంగాల నుండి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే సినిమాపై ఫ్యాషన్ తో బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా టాలెంట్ ని నమ్ముకుని సినిమాల్లోకి వచ్చిన వాళ్ళూ ఉన్నారు. వీళ్ళలో “నవీన్ పోలిశెట్టి” మూడో రకానికి చెందిన వాడు. సినిమా ఇండస్ట్రీ కి ఏమాత్రం సంబంధం లేని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ఇక ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ నుండి రావడం కాదు… టాలెంట్ ఉంటే చాలు ఎవ్వరైనా ఇండస్ట్రీలో చక్రం తిప్పొచ్చు అని నవీన్ పోలిశెట్టి ప్రూవ్ చేసాడు. అయితే నవీన్ పోలిశెట్టి హీరోగా మారడానికి చాలా కష్టాలు పడ్డాడు. సైడ్ ఆర్టిస్ట్ మొదలుకుని, ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ, ఫైనల్ గా “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా నవీన్ పోలిశెట్టి లోని అద్భుతమైన నటుడ్ని వెండితెరకి పరిచయం చేసింది. 2019 జూన్21న రిలీజ్ అయిన ఆ సినిమా టాలీవుడ్ లో మంచి క్లాసిక్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక నేటికీ ఈ సినిమా విడుదలై సరిగ్గా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” గురించి కొన్ని విశేషాలని తెలుసుకుందాం…

5Years For Agent Sai Srinivasa Atreya Movie

టాలెంట్ ఉంటె చాలు హీరో అయినట్టే.. ప్రూవ్ చేసిన నవీన్..

ఇక టాలీవుడ్ లో నవీన్ పోలిశెట్టి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో చిన్న కీ రోల్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత డి ఫర్ దోపిడీ, వన్ నేనొక్కడినే వంటి చిత్రాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చాడు. అప్పుడే “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” (5Years For Agent Sai Srinivasa Atreya) మూవీ రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఈ సినిమాతో ఫస్ట్ టైం హీరోగా చేసి, సినిమాకి కూడా తనే స్వయంగా స్క్రీన్ ప్లే రాసుకుని, హిట్ కొట్టాడు నవీన్ పోలిశెట్టి. అంతే కాదు, ఈ సినిమాను తెలుగు మూవీ లవర్స్ అందరూ గుర్తు పెట్టుకునేే లా చేశాడు అంటే నవీన్ పోలిశెట్టి ఏ రేంజ్ లో ఇరగదీశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తెలుగు ఇండస్ట్రీ లో టాలెంట్ ఉంటే చాలు హీరో అయినట్టే అని ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి ప్రూవ్ చేసాడు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాను స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాహుల్ యాదవ్ నిర్మించగా, స్వరూప్ R.S.J దర్శకత్వం వహించాడు.

- Advertisement -

చంటబ్బాయి ఇన్స్పిరేషన్ తో…

టాలీవుడ్ లో ఏజెంట్ మూవీస్ లో ఎంటర్టైన్మెంట్ అంటే అందరికి గుర్తొచ్చే ఏకైక సినిమా “చంటబ్బాయి”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా జంధ్యాల దర్శకత్వంలో నటించిన ఆ సినిమా మూడున్నర దశాబ్దాల కింద వచ్చి మంచి విజయం సాధించగా, ఇప్పటికి కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. చిరులోనే కామెడీ కోణాన్ని ఈ సినిమా పూర్తిగా బయటికి తీసింది. చిరంజీవి జేమ్స్ పాండ్ (పాండు రంగారావు) గా డిటెక్టివ్ గా నటించడమే కాకుండా, సినిమాలో అద్భుతంగా కామెడీ పండించారని చెప్పాలి. ఇప్పటికి తెలుగు సినీ ప్రేక్షకులకి ఎంతో ఇష్టమైన ఈ సినిమా టీవీల్లో వేస్తె ఆడియన్స్ అతుక్కుపోతారు. ఈ సినిమాని ఇన్స్పిర్ అయ్యే నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తెరకెక్కించడం జరిగింది.

5Years For Agent Sai Srinivasa Atreya Movie

FBI ఓపెన్ చేసి ఐదేళ్లయింది…

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే… ఆత్రేయ (నవీన్ పోలిశెట్టి) నెల్లూరు కేంద్రంగా చిన్నా చితకా కేసులను పరిష్కరించే, అంతగా పేరులేని ఓ డిటెక్టీవ్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ పెద్ద కేసుని ఇన్వెస్టిగేట్ చేసి మంచి పేరు తెచ్చుకొని జీవితంలో స్థిర పడాలి అని ఎదురుచూస్తున్న ఆత్రేయకు, అనుకోకుండా ఒకరోజు రైలు పట్టాల ప్రక్కన అనుమానాదాస్పద స్థితిలో శవంగా మారిన ఓ యువతి కేసును ఛేదించే అవకాశం దక్కుతుంది. దానితో ఆ యువతి మరణం వెనుక వున్న వాస్తవాలను ఛేదించే దిశగా ఆత్రేయ తన విచారణ మొదలు పెడతాడు. ఆ యువతిని చంపిన ఆ నేరస్తులు ఎవరు ? ఈ కేసులోని చిక్కుముడులను ఆత్రేయ ఎలా ఛేదిస్తాడు ? అనేది మిగతా కథ.

ఇక ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయగా పరకాయ ప్రవేశం చేసి నటించాడని చెప్పాలి. తన గెటప్ తో సహా ప్రతి సీన్ లో అద్భుతంగా కామెడీ పండించాడని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో ఏజెంట్ ఆత్రేయ ఓపెన్ చేసిన ఆఫీస్ పేరు FBI అంటే ఏదో CBI అన్న లెవెల్లో బిల్డప్ ఇస్తూ, తీరా దానిపేరు “ఫాతిమా బ్యూరో అఫ్ ఇన్వస్టిగేషన్” అని ఫాతిమా తన X లవర్ అంటూ షాకిస్తాడు. అలాంటి కామెడీలు సినిమాలో ఉన్నో ఉన్నాయి. ఇక సినిమాలో అందరికీ ఇష్టమైన సీన్… మారువేషంలో ఉన్న ఆత్రేయ బుక్ కొనమని కానిస్టేబుల్ ని ఇంగ్లీష్ లో రిక్వెస్ట్ చేసే సీన్… ఈ సీన్ కి చాలా మంది పొట్టపగిలేలా నవ్వుతారు. సినిమా మొదలయి, హీరో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి హీరో ఉండే ప్రతి సన్నివేశంలో ఏజెంట్ చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. దీనికి దర్శకుడి స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో పాటు, నవీన్ పోలిశెట్టి అల్టిమేట్ కామెడీ టైమింగ్ చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఆత్రేయ పాత్రలో నవీన్ ని చూసాక ఇక ఏ హీరో కూడా ఆ పాత్రకి సెట్ అవ్వడు అనే రేంజ్ లో అదరగొట్టాడని చెప్పాలి. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి వరుస సినిమాల్లో నటిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు