Isha koppikar: క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన నాగ్ బ్యూటీ..!

Isha koppikar.. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాలను చాలామంది కెరియర్ గురించి ఆలోచించి బయటపెట్టరు.. కానీ మరి కొంతమంది కెరియర్లో సక్సెస్ అయిన తర్వాత బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇప్పటికే చిన్న సెలబ్రిటీలను మొదలుకొని పెద్దపెద్ద స్టార్ హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను మీడియా ముఖంగా చెప్పుకుంటున్నారు.. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో బ్యూటీ ఇషా కొప్పికర్ కూడా సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది..

చంద్రలేఖ సినిమాతో ఎంట్రీ..

Isha Koppikar: The nag beauty who opened her mouth on the casting couch..!
Isha Koppikar: The nag beauty who opened her mouth on the casting couch..!

ప్రముఖ హీరోయిన్ ఇషా కొప్పికర్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు. కింగ్ నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రలేఖ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాతోనే అందం , అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇక అంతే కాదు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి ఆకట్టుకుంది.. బాలీవుడ్లో కాంటే సినిమాల్లో ఇష్క్ సముందర్ .. కంపెనీలోని ఖల్లాస్ వంటి ఐటమ్ సాంగ్స్ లో కూడా నర్తించి ఆకట్టుకుంది. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరమైన ఈమె.. మళ్లీ ఫిజా అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది..

@18 లోనే వేధింపులకు గురయ్యాను..

ఇక రీఎంట్రీలో భాగంగానే.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషా కొప్పికర్ కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడింది.. ఈమె మాట్లాడుతూ.. నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు.. ఒక సెక్రటరీ, ఒక నటుడు నా వద్దకు వచ్చి అవకాశాలు రావాలంటే స్టార్లతో స్నేహంగా ఉండాలని చెప్పారు.. నేను అందరితో కూడా చాలా స్నేహపూర్వకంగానే ఉంటాను.. కానీ నిర్మాత ఏక్తాకపూర్ ఒకసారి నాతో కొంత ఆటిట్యూడ్ కలిగి ఉండాలని చెప్పారు.. ఇక 23 ఏళ్ల వయసులో హిందీ చిత్ర సీమలో ఏ లిస్టర్ నటుడు .. ఒంటరిగా కలవమని అడిగాడు.. అతడికి ఇతర నటీమణులతో సంబంధం ఉన్నట్లు.. అప్పట్లోనే పుకార్లు వచ్చాయి.. దాంతో నేను నిరాకరించాను.. ఒంటరిగా రాలేనని కూడా చెప్పాను అంటూ తెలిపింది ఇషా కొప్పికర్..

- Advertisement -

విలువలు ఉంటే అవకాశాలు రావు..

ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయి.. విలువలు ఉంటే ఇక్కడ అవకాశాలు రావడం చాలా కష్టం.. నాకు సమకాలికులైన నటీమణులు చాలామంది ఇండస్ట్రీకి దూరమయ్యారు.. వారిలో చాలామంది పరిశ్రమను వదులుకున్నారు.. పరిశ్రమలో అప్పటికే ఉన్న మరి కొందరు కూడా ఈ వేధింపులు భరించలేక అవకాశాలు అందుకోలేక ఇండస్ట్రీకి దూరం అయ్యారు అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

ఇషా కొప్పికర్ కెరియర్..

చివరిగా తమిళ చిత్రం అయలాన్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈమె కెరియర్ విషయానికి వస్తే.. ఈమె భారతదేశానికి చెందిన మోడల్.. సినిమా నటి.. రాజకీయ నాయకురాలు కూడా.. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళ్ , మరాఠీ భాషా చిత్రాలలో నటించిన ఈమె.. 2019 జనవరి 28న బిజెపి పార్టీలో చేరింది.. ఇక ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2009లో టిమ్మీ నారంగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. చంద్రలేఖ సినిమా తర్వాత 2001లో ప్రేమతో రా అనే సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత 2017 లో కేశవ అనే సినిమాలో కూడా నటించింది.. ఇక తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. ఇక సినిమాలే కాదు ఫిక్సర్ , దహనం వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు