Prashanth Varma : హనుమాన్ దర్శకుడి నెక్స్ట్ ప్లాన్ ఏంటబ్బా..

Prashanth Varma : ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకున్న సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.. ఈ సినిమా ఏకంగా రూ.320 కోట్లకి పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్‌’పైనే ఉంది.. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించిన టీమ్ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ను వదల్లేదు..ఆ సినిమా కన్నా ముందు అనుపమ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఆ తర్వాత అన్నా జై హనుమాన్ సినిమాను మొదలు పెడతారా అనే సందేహం అందరికీ వస్తుంది..

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పెండింగ్ లో ఉన్న సినిమా పై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అనుపమ పరమేశ్వరన్ తో ఆక్టోపస్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. దాదాపుగా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పూర్తి అయినట్లు తెలుస్తుంది.. ఆ సినిమాను ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడు.. అయితే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ హీరో రణవీర్ తో ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు గతంలో బాగా వైరల్ అయ్యాయి.. కానీ ఆ సినిమా అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ హనుమాన్ జయంతి రోజున ఒక అప్డేట్ ఇచ్చినా ఇప్పటివరకు స్క్రీప్ట్ ను మాత్రం పూర్తి చెయ్యలేదు..

What is Prashant Varma's next plan?
What is Prashant Varma’s next plan?

అసలు ప్రీ ప్రోడక్షన్ పనులను కూడా మొదలు పెట్టలేదనే టాక్ వినిపిస్తుంది.. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడా అని సినీ లవర్స్ తెగ వెతికేస్తున్నారు.. మొదటి సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ సినిమా పై మాత్రం అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి.. రాముడు, హనుమంతుడు పాత్రలకు స్టార్ హీరోలు దొరికే వరకు నిరీక్షణ తప్పదు. బాలీవుడ్ రామాయణంలో చేస్తున్న నటులను రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రశాంత్ వర్మ మీద ఉంది. స్టార్ క్యాస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్న ఈ దర్శకుడు ముందైతే ఫైనల్ వెర్షన్ లాక్ చేసుకుని ఆ తర్వాత మిగిలిన పనులు చూసుకోబోతున్నాడు. హనుమాన్ ఏదో మాములు హిట్ అయితే ఇంత చర్చ ఉండేది కాదు కానీ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ కావడం వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకొనే స్థితిలో లేడు.. మరి ఎప్పుడు అప్డేట్ ఇస్తాడో చూడాలి…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు