Kalki 2898 AD : ఇంత చేసినా జక్కన్నను అందుకోలేడు… ఇప్పటికైనా నాగి కళ్లు తెరుస్తాడా?

Kalki 2898 AD : దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఏర్పాటు చేసిన పాన్ ఇండియా బాటలో నడవడానికి ఎంతో మంది టాలెంటెడ్ హీరోలు రెడీ అవుతున్నారు. అయితే రాజమౌళి తర్వాత సుకుమార్, ప్రశాంత్ వర్మ మాత్రమే ఆ లెవెల్లో సక్సెస్ కాగలిగాడు. ఇక ఇప్పుడు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఈయన రాజమౌళి రేంజ్ ని అందుకోగలడా? అనేది కల్కి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీ లవర్స్ కు ఉన్న ప్రశ్న. అయితే తాజాగా కల్కి మూవీ ప్రమోషన్స్ చూస్తే ఇంత చేసినా జక్కన్నను ఇతను అందుకోలేడు అంటున్నారు. నాగి ఇకనైనా కళ్ళు తెరుస్తాడా?

జక్కన్న స్ట్రాటజీ వేరు

జక్కన్న స్ట్రాటజీ సినిమా ప్రమోషన్ విషయంలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకులకు కథపై క్లారిటీ వచ్చేలా చేస్తారు. ముందు నుంచే తన సినిమాపై ప్రేక్షకుల విపరీతంగా ఆకలిని పెంచి, ప్రమోషన్ల ద్వారా తన సినిమా ఎలా ఉంటుందో ఆ ఘుమఘుమలు చూపించి, చిట్టచివరి నిమిషంలో వడ్డించేస్తాడు. దీంతో అది సద్ది అన్నమైనా సరే ప్రేక్షకులకు పంచభక్ష పరమాన్నం తిన్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది. ఏవైనా మైనస్ లు ఉన్నాయేమో అని ఆరా తీసేలోపే ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో కావాల్సినన్ని కనెక్షన్లు కొల్లగొడుతుంది.

దీనంతటికీ వెనక రాజమౌళి మాస్టర్ మైండ్ ఉంటుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే రాజమౌళి ప్రమోషన్ల ద్వారా అన్ని భాషల ప్రేక్షకులకు సినిమా రీచ్ అయ్యేలా, ప్రమోషన్స్ ద్వారా కథపై క్లారిటీ వచ్చేలా చేస్తాడు. దీంతో ప్రేక్షకుడు కథపై ఫుల్ క్లారిటీతో జక్కన్న స్క్రీన్ ప్లేను ఎంజాయ్ చేయడానికి థియేటర్లలోకి అడుగు పెడతారు. కానీ నాగి ప్రమోషన్స్ పై పెదవి విరుస్తున్నారు సినీ జనాలు.

- Advertisement -

Reality Check: Is Nag Ashwin Bigger Than SS Rajamouli?

నాగి కళ్ళు తెరుస్తాడా?

నాగ్ అశ్విన్ ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ మూవీగా కల్కి 2898 ఏడిని జూన్ 27న థియేటర్లోకి తీసుకురాబోతున్నాడు. కానీ ప్రమోషన్ల పరంగా చూసుకుంటే అసలు ఇది పాన్ ఇండియా సినిమా నేనా అనిపించేలా చేస్తున్నాడు నాగి. ఇంత పెద్ద బడ్జెట్ పెట్టినప్పటికీ, అందులో దిగ్గజ నటీనటులు ఉన్నప్పటికీ సినిమాకు తగ్గ స్థాయిలో ప్రమోషన్స్ చేసుకోలేకపోతున్నారు. 6 రోజుల్లోనే సినిమా థియేటర్లలోకి రానుంది. కానీ ప్రేక్షకులకు కథపై అస్సలు క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఈ సినిమాకు ప్రమోషన్ కూడా చేయట్లేదు.

ఇక అప్పుడప్పుడు నాగి వీడియోలు రిలీజ్ చేస్తున్నప్పటికీ కథ గురించి ఆయన ఇస్తున్న వివరణ పెద్దగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేయలేకపోతోంది. అయినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల, వీకెండ్స్ వరకు మల్టీప్లెక్స్ ల వల్ల ఈ సినిమాకు భారీ ఓపెనింగ్ అయితే పక్కా. ఆ తర్వాత ఈ సినిమాను కాపాడేది బీసీ సెంటర్ల ప్రేక్షకులే. అయితే నాగి వాళ్లను మూవీకి తగ్గ విధంగా ప్రిపేర్ చేయడంలో ఫెయిల్ అయితే కష్టమే. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తే బెటర్ అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు