Siddharth: మీడియాపై మరోసారి ఫైర్ అయిన హీరో సిద్దార్థ్.. నెటిజన్స్ ఫైర్..!

Siddharth.. ప్రముఖ హీరో సిద్ధార్థ్ నటుడిగానే కాదు.. సింగర్ , నిర్మాతగా కూడా పేరు సొంతం చేసుకున్నారు.. ఎలాంటి పాత్రలో అయినా సరే కామెడీ తో పాటు ఎమోషన్స్ కూడా పండించి తనదైన నటనతో ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రేమ కథ చిత్రాలే కాదు వైవిద్య భరితమైన జానర్లలో కూడా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను మెప్పించే సిద్ధార్థ్.. నిజజీవితంలో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటారనే చెప్పాలి. పర్సనల్ లైఫ్ విషయంలో ఎంతో గోప్యత పాటిస్తూ ఉంటాడు. అందుకే మీడియాతో ఇంటరాక్షన్ చాలా తక్కువ. అంతేకాదు బయట తన తీరుతో తరచూ వివాదాలలో నిలుస్తూ ఉంటాడు. ఇక ఎలాంటి విషయాన్ని అయినా సరే నిర్మొహమాటంగా.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండే సిద్దార్థ్ .. అప్పుడప్పుడు మీడియాపై ఫైర్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారనటంలో సందేహం లేదు.

Siddharth: Hero Siddharth who is on fire once again on the media.. Netizens fire..!
Siddharth: Hero Siddharth who is on fire once again on the media.. Netizens fire..!

ఇప్పటికే అదితి తో ప్రేమాయణం నడిపిన ఈయన.. ఒకసారి హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో.. మీడియా వారు ఫోటోలు తీస్తే ప్రయత్నం చేశారు. దీంతో అప్పుడు మీడియాపై కోప్పడ్డారు.. తమకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు.. కానీ ఎట్టకేలకు ఆమెతో నిశ్చితార్థం జరుపుకొని పెళ్లికి సిద్ధం అయిపోయారు. ఇక ఇప్పుడు మరొకసారి మీడియా మీద మండి పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. త్వరలోనే అదితి తో పెళ్లి పీటలెక్కనున్న ఈయన.. రీసెంట్గా ముంబైలోని బాంద్రా లో సందడి చేశారు.. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియా వ్యక్తి ఫోటో తీసేందుకు ప్రయత్నించగా.. ఫోటోకి ఫోజులు ఇవ్వాలని కూడా వారు కోరారు.. దాంతో వారిపై అసహనం వ్యక్తం చేశాడు సిద్దార్థ్ .. ఒక మీడియా వ్యక్తి సర్ సర్ అంటూ సిద్దార్థ్ వెంటపడ్డాడు.. కానీ సిద్దార్థ్ మాత్రం అలా సౌండ్ చేయకు బాస్.. నాకు నచ్చదు.. నీకు చెప్పాను కదా అంటూ ఆయన పై అసహనం చూపించాడు..

సిద్దార్థ్ అలా అనడంతో ఆ వ్యక్తి క్షమాపణ చెప్పగా.. థాంక్యూ అంటూ సిద్దార్థ్ కార్ ఎక్కాడు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సిద్దార్థ్ కి ఎంత పొగరు? సెల్ఫీ అడిగితే ఇంత కోపమా? అంటూ మండిపడుతున్నారు. ఇలా సిద్దార్థ్ ప్రవర్తించడం మొదటిసారి కాదు.. చాలాసార్లు గతంలో కూడా తన ఆటిట్యూడ్ చూపించి వార్తల్లో నిలిచాడు.. కనీసం అన్నిసార్లు వార్తల్లో నిలిచినప్పుడు ఈయన తన ఆటిట్యూడ్ మార్చుకుంటారని అందరూ అనుకున్నారు.. కానీ ఆయనలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఇక ఎప్పుడు మీడియా వెంటపడినా సరే వారిపై అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు సిద్దార్థ్.

- Advertisement -

సిద్దార్థ్ కెరియర్..

సిద్ధార్థ్ కెరియర్ విషయానికి వస్తే.. సరైన సక్సెస్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే చిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కంటెంట్ బాగుంది కానీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయారు. ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.. మరి ఇలాంటి ప్రవర్తన మార్చుకుంటే ఈయన సినిమాలతో హిట్టు కొట్టే అవకాశాలు ఉన్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.. మరి ఇకనైనా సిద్ధార్థ తన ప్రవర్తనను మార్చుకుంటారేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు