Allu Arjun : మెగా హీరోలతో బన్నీ మల్టీ స్టారర్ మూవీ చేస్తాడా? అయితే ఎవరితో?

Allu Arjun : మెగా కాంపౌండ్ నుండి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోలలో అల్లు అర్జున్ ఒకరు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశాడు.. ఆ సినిమాలు భారీ హిట్ టాక్ ను అందుకున్నాయి.. గంగ్రోత్రి సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చి పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చాడు.. ఇప్పుడు పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ భారీ హిట్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. అయితే బన్నీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. బన్నీ మల్టీ స్టారర్ సినిమా చేస్తాడా? చేస్తే ఎవరితో చేస్తాడు? ఈ వార్త పై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..

బన్నీ స్టైల్ మాత్రమే కాదు.. ఆయన డ్యాన్స్ కు ఫ్యాన్స్ కూడా ఉన్నారు.. ఇదిలా ఉండగా.. బన్నీ సినిమాలలో ఎక్కువ సినిమాలు సోలో హీరోగా చేసి మంచి సక్సెస్ ను అందుకున్నారు. పుష్ప వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించాడు.. నేషనల్ వైడ్ మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు.. అయితే ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా మెగా హీరోల సరసన హీరోగా నటించలేదు. బన్నీతో మెగా హీరోలు నటిస్తే బాగుంటుందని మెగా అభిమానులతో పాటుగా, అటు అల్లు అర్జున్ అభిమానులు కూడా అభిప్రాయ పడుతున్నారు..

Bunny will do a multi-starrer movie with mega heroes?
Bunny will do a multi-starrer movie with mega heroes?

ఇకపోతే ఇటీవల ఏపీలో ఎన్నికల విషయంలో జరిగిన కొన్నిటి వల్ల ఇప్పుడు మెగా ఫ్యామిలికి దూరం అయినట్లు కనిపిస్తుంది.. ఇక మెగా హీరోలు కూడా బన్నీని దూరం పెట్టినట్లు తెలుస్తుంది.. అయితే సినిమాలు అంటే మంచి కథ దొరికితే చేస్తాడేమో తెలియాల్సి ఉంది.. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ గతంలో బ్లాక్ బాస్టర్ అందుకున్న పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.. డిసెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై ఓ రేంజులో అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. మరి ఆ అంచనాలను సుక్కు రిచ్ అవుతాడో లేదో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు