Jani Master : జానీ మాస్టర్ పై డిప్యూటీ సీఎం కు కంప్లైంట్.. రియాక్షన్ ఉంటుందా?

Jani Master : ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఈయన ఇండస్ట్రీలోని స్టార్ హీరోల చేత స్టెప్పులు వేయించాడు.. ప్రస్తుతం సినిమాలను చేస్తూనే మరోవైపు బుల్లి తెరపై ప్రసారం అవుతున్న ప్రముఖ డ్యాన్స్ షో ఢీ లో జడ్జిగా వ్యవహారిస్తున్నారు.. తాజాగా ఈయన పై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.. మరి దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడా అనేది ఆసక్తిగా మారింది.. డ్యాన్సర్ సతీష్ మాస్టర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.. ఈ నెల 5 న కూడా సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

ఆ ఫిర్యాదులో జానీ మాస్టర్ అతన్ని షూటింగ్ లకు పిలవద్దని యూనిట్ కు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు సతీష్ పోలీసుల ఫోర్యాదులో పేర్కొన్నాడు.. అతను డ్యాన్స్ ను జీవితంగా భావిస్తున్నాను.. ఇప్పుడు మాస్టర్ నా కేరీర్ ను నాశనం చేస్తున్నాడని పోలీసుల ముందు వాపోయినట్లు ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఈ విషయం పై పోలీసులు స్పందించలేదని వార్త వినిపిస్తుంది.. దాంతో సతీష్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది..

Complaint to Deputy CM on Jani Master..
Complaint to Deputy CM on Jani Master..

అసలు విషయానికొస్తే.. సతీష్ గత నాలుగు నెలలుగా డ్యాన్స్ షోకు వెళ్లడం లేదని.. ఆర్థిక ఇబ్బందులతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు.. ఒకవేళ ఎవరైనా తనని షూటింగ్ లకు పిలిస్తే వాళ్లకు ఫైన్ లు వేస్తున్నాడని సతీష్ ఆరోపించారు.. జనరల్ బాడీ మీటింగ్ లో సమస్యల పై మాట్లాడినందుకే జానీ మాస్టర్ తన పై కక్ష్య పెంచుకున్నాడని పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు. సతీష్ ఫిర్యాదు తో జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మాస్టర్ ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ & డైరెక్టర్స్ అసోసియేషన్ కు అధ్యక్షులు గా జానీ మాస్టర్ వ్యవహారిస్తున్నారన్న సంగతి తెలిసిందే.. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియాల్సి ఉంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు