Poonam Kaur: ప్రముఖ పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ సినిమాలలో కంటే ఈమధ్య సోషల్ మీడియాలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ నాయకులను ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేసే కామెంట్లు సర్వత్రా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఈమె ఎప్పుడు సపోర్ట్ చేస్తుందో తెలియదు.. ఎప్పుడు కాంట్రవర్సీగా కామెంట్లు చేస్తుందో తెలియదు… ఒక్కొక్కసారి ఒక్కోలాగా కామెంట్లు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది..
పవన్ మోసం చేసి గెలిచాడు..పూనమ్
తాజాగా ఈమె తన ట్విట్టర్ ఖాతా నుండి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ.. మోసగాడిలా కుట్రలు చేసి గెలవడం కంటే యోధుడిగా పోరాడి ఓడిపోవడం మేలు అంటూ పోస్ట్ చేసింది పూనమ్ కౌర్.. దీంతో పూనం అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పోస్ట్ షేర్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే పూనమ్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.. అసలు విషయంలోకి వెళితే.. ఈసారి సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.. అంతే కాదు 21 స్థానాలలో పోటీ చేసి ఆ స్థానాలు అన్నింటినీ కైవసం చేసుకుని.. 100% స్ట్రైక్ తో రికార్డు సృష్టించారు. ఇక ఈరోజు తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
హాట్ టాపిక్ గా మారుతున్న పూనమ్ కామెంట్స్..
ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, అభిమానులు పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతుంటే.. పూనమ్ మాత్రం ఊహించని విధంగా ఇలాంటి కామెంట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. మరొకవైపు జనసేన 46% ఓటు బ్యాంకు ఉన్నా.. డిపాజిట్లు కూడా దక్కని విధంగా ఓడిపోయింది.. అయితే ఇందులో ఈవీఎంల హ్యాకింగ్ వల్లే ఇలా జరిగిందని కొత్త వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.. ఇలాంటి నేపథ్యంలో పూనమ్ చేసిన ఈ కామెంట్ సరికొత్త అనుమానాలకు దారితీస్తోంది.. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మోసం చేసి గెలిచాడని పోరాడి గెలవలేదు అంటూ తెలిపింది పూనమ్ కౌర్..
పూనమ్ కెరియర్..
ఇక పూనమ్ కౌర్ కెరియర్ విషయానికి వస్తే.. ఈమె ఒక భారతీయ నటి.. మోడల్ కూడా.. ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాలలో కనిపిస్తుంది. అలాగే తెలంగాణలో రాజకీయ నాయకురాలిగా వ్యవహరించిన ఈమె కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు కూడా.. మాయాజాలం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. అంతకుముందే డైరెక్టర్ తేజ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది ..కానీ ఆ సినిమా కొన్ని కారణాలవల్ల ప్రారంభం కాలేదు.. మరొకసారి తేజ సినిమా విచిత్రం కోసం ఆఫర్ వచ్చినా.. ఆ సినిమా కంటే ముందే మాయాజాలం సినిమా విడుదల కావడంతో అలా మాయాజాలం సినిమాతో ఇండస్ట్రీకి తొలి అడుగులు వేసింది. ఆ తర్వాత సౌర్యం సినిమాలో కీలకపాత్ర పోషించిన ఈమె.. తమిళ్, కన్నడ చిత్రాలలో కూడా నటించింది.
Loosing as a principled warrior is better than winning as conspiring cheater .#justthoughts
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 21, 2024