Swag : “దివాకర్ పేట SI భవభూతి” ఇక్కడా… శ్రీవిష్ణు ఎక్స్ట్రార్డినరీ మేకోవర్!

Swag : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన శ్రీ విష్ణు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత కొన్నాళ్లగా సరైన హిట్ లేక సతమతమైన శ్రీ విష్ణు ఇప్పుడు వరుస విజయాలతో గాడిలో పడ్డాడు. టాలీవుడ్ లో టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు కాగా, శ్రీ విష్ణు స్క్రిప్ట్ సెలక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది. పెద్దగా హీరోయిజం ఉన్న కథల వైపు వెళ్లకుండా తనకు సెట్ అయ్యే కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. అలాగే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసే హీరోలలో కూడా శ్రీ విష్ణు ఒకడు. ఇక శ్రీ విష్ణు లాస్ట్ ఇయర్ సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకోగా, ఈ ఇయర్ వస్తూనే “ఓం బీమ్ బుష్” సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టేసాడు. ఇక రెండు నెలల కింద రిలీజ్ అయిన ఓం భీం బుష్ అనే హారర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. కామెడీ హారర్ గా తెరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తన తదుపరి చిత్రం “స్వాగ్” (Swag) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

Sree Vishnu Swag Movie Making Video Viral

స్వాగ్ కోసం శ్రీ విష్ణు ఎక్స్ట్రార్డినరీ ట్రాన్స్ఫర్మేషన్…

ఇక శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి హసిత్ గోలి డైరెక్షన్ వహింస్తున్నాడు. కాగా రీతు వర్మ హీరోయిన్ గా నటింస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్సాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలో యంగ్ బ్యూటీ దక్ష, మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్ కీలకపాత్రలు నటించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూరాస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని గ్రాండ్ గా టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు భవభూతి పాత్రలో పరిచయం చేయబడి, స్త్రీవాదిగా చిత్రీకరించబడ్డాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడు శ్రీ విష్ణు. ఇక ఈ సినిమా కోసం శ్రీ విష్ణు చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న స్వాగ్ సినిమాకి సంబంధించి తాజాగా ఓ మేకింగ్ వీడియో ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

- Advertisement -

స్వాగ్ కోసం శ్రీ విష్ణు మేకోవర్…

ఇక స్వాగ్ సినిమాని అచ్చ తెలుగు సినిమా అంటూ మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీ విష్ణు పాత్ర మేకోవర్ కి సంబంధించి ఒక మేకింగ్ వీడియో ని రిలీజ్ చేసారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, సినిమా కోసం అందులోని పాత్ర కోసం శ్రీ విష్ణు ఎంత కష్టపడుతున్నాడో తెలుస్తుంది. ఇక శ్రీ విష్ణు కి సంబంధించి ఆ పాత్ర మేకప్ ని నేషనల్ అవార్డు విన్నర్ ‘పట్టణం రషీద్’ హీరో శ్రీ విష్ణుకి మేకప్ వేయడం జరిగింది. వీడియో లో శ్రీ విష్ణు కి దాదాపు ఓ రెండు గంటలు మేకప్ వేయడానికి సమయం పట్టిందని అంటున్నారు. ఇక స్వాగ్ సినిమా నుండి వచ్చే అప్డేట్స్ మరింత క్రేజీ గా ఉండబోతున్నాయని సమాచారం. ఇక స్వాగ్ సినిమాని జులై మూడో వారం లో లేదా ఆగష్టు లో సోలో రిలీజ్ డేట్ ని చూసుకుని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు