Harish Shankar leaks: ఎవరు లీక్ చేసారు.? డైరెక్టరే చేసుకుంటున్నాడు

Harish Shankar leaks: బేసిగ్గా ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనిని ఉపయోగించడం బట్టి దీని పరిణామాలు ఉంటాయి అని చెప్పొచ్చు. దీనిని కొందరు కరెక్ట్ వే లో ఉపయోగించి చాలామంది ఫేమస్ అవుతున్నారు. రాంగ్ వే లో ఉపయోగించి కొంతమంది చాలా స్కాం చేస్తున్నారు. ఇకపోతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి రీసెంట్ గా ఏ పెద్ద సినిమా జరిగినా కూడా ఆ సినిమాకి సంబంధించిన కొన్ని ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. ఇలా ఫొటోస్, వీడియోస్ అనేవి లీక్ కాకుండా ఉండడానికి చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఆయా దర్శకులు చాలా జాగ్రత్తలు పడతారు. ఇకపోతే ఒక దర్శకుడు మాత్రం తన సినిమాకు సంబంధించిన ఫొటోస్ ను సాంగ్స్ లోని లిరిక్స్ ను తనే లీక్ చేస్తున్నాడు. తన మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్.

Harish Shankar

రవితేజ నటించిన షాక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. తన మొదటి సినిమానే హరీష్ కు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ రవితేజ అవకాశం ఇవ్వడంతో మిరపకాయతో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అక్కడితో దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడిపోయాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమాను తనకి ఎక్కించి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలి అనుకుంటాడు అచ్చం అలానే చూపించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించగలిగాడు.

- Advertisement -

ఆ తర్వాత హరిశంకర్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని తెచ్చుకున్నాయి. రీమేక్ ఫిలిం చేసినా కూడా దానిలో హరి శంకర్ మార్క్ ఉంటుంది అని చెప్పొచ్చు. హరీష్ ఎంత మందితో సినిమాలు చేసినా కూడా హీరో రవితేజ తో సినిమా చేయటం అనేది ఒక ప్రత్యేకమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. అయితే హరీష్ శంకర్ ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. కేవలం పాటలు మాత్రమే మినహా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను డైరెక్ట్ గా హరీష్ శంకర్ షేర్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పాటలలోని లిరిక్స్ ను, సెట్స్ లోని ఫొటోస్ ను, నెక్స్ట్ షూటింగ్ జరపబోయే ప్రదేశాలను వీటన్నిటిని కూడా హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ వస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు