Samyuktha Menon : నక్క తోక తొక్కిన డెవిల్ బ్యూటీ.. అక్కడ ఆఫర్ పట్టేసింది

Samyuktha Menon : సౌత్ లో లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ నక్క తోక తొక్కినట్టుగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ మరో బడా ఆఫర్ కొట్టేసిందనే వార్త బయటకు వచ్చింది. మరి ఇంతకీ సంయుక్త మీనన్ దక్కించుకున్న ఆ లక్కీ ఛాన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

గోల్డెన్ బ్యూటీకి బడా ఆఫర్

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన హీరోయిన్లలో సంయుక్త మీనన్ కూడా ఒకరు. భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన సంయుక్త మొదటి సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా వంటి స్టార్స్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత బింబిసారా, సార్, విరుపాక్ష సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మధ్యలోనే సంయుక్త మీనన్ ఎంత పాపులర్ అయ్యిందంటే ఈ అమ్మడు సినిమాలో ఉంటే హెట్టే అని సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేవారు హీరోలు, దర్శకనిర్మాతలు. దానికి తగ్గట్టే ఆమె నటించిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఈ మూడు సినిమాల సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

Samyuktha Menon New Photoshoot | Samyuktha Menon Spicy Pics | Samyuktha Menon Insta Hd Walls - Telugu States News Samyuktha Menon New Photos

- Advertisement -

తరువాత డెవిల్ అనే సినిమాలో మెరిసింది. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆ తప్పంతా వివాదం వల్ల దర్శకనిర్మాతల తలపైనే పడింది. ప్రస్తుతం స్వయంభు అనే పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సౌత్ లో ఈ రేంజ్ లో సక్సెస్ ను చూసిన సంయుక్తకు ఇప్పుడు ఓ బడా చాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

బాలీవుడ్ లోకి ఎంట్రీ

సౌత్ హీరోల పాలిట గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సంయుక్త ఇప్పుడు బాలీవుడ్ లో ఛాన్స్ దక్కించుకుంది. మహారాగ్ని అనే మూవీలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి మంచి ఆఫర్లు కొట్టేస్తూ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ అనిపించుకుంటుంది. అయితే ఇప్పటి వరకు కేవలం సాంప్రదాయ లుక్ లో కనిపించి ఆకట్టుకున్న సంయుక్త ఇకపై బోల్డ్ రోల్స్ చేయబోతుందని అంటున్నారు. బాలీవుడ్ లో మడి కట్టుకొని కూర్చుంటే రాణించడం కష్టమే. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఈ అమ్మడు అందాల విందు చేస్తుందని అంటున్నారు. మరి ఇప్పటిదాకా పక్కింటి అమ్మాయిలా అందంగా కనిపించి తన అభినయంతో ఆకట్టుకున్న సంయుక్త ఎంతవరకు గ్లామర్ తో హిందీ మూవీ లవర్స్ ను తన వైపుకు తిప్పుకుంటుందో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె పోస్ట్ చేసిన నిమిషాల్లోనే ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవలే ఎయిర్ పోర్ట్ లో చిట్టిపొట్టి దుస్తువుల్లో దర్శనం ఇచ్చింది. మరి బీటౌన్ లో అడుగు పెట్టాక ఇంకెంత హాట్ గా మారిపోతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు