Kalki 2898 AD Collections : ఈ ఒక్కటి సరిపోదా… కల్కికి 2000 కోట్ల కలెక్షన్లు రావడానికి

Kalki 2898 AD Collections : బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి జక్కన్న సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ఇండియన్ సినిమాగా మారిందన్న మాట వాస్తవం. సినిమాల స్థాయి పెరగడమే కాదు సినిమాల బడ్జెట్ కూడా పెరగడంతో మార్కెట్లో మన సినిమాలు భారీగా సేల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత రిలీజ్ అయ్యే భారీ పాన్ ఇండియా సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను నమోదు చేసుకుంటున్నాయి. మరి తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన టాప్ 10 సినిమాలు ఏంటి, కల్కి 2000 కలెక్షన్లను కొల్లగొట్టగలదా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు

ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్నది రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీ. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినేసస్ 451 కోట్లు జరిగింది. ఆ తర్వాత 388 కోట్లతో కల్కి 2898 ఏడి మూవీ రెండవ స్థానంలో నిలిచింది. ప్రభాస్, రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలిని కల్కి బీట్ చేయడం విశేషం. కానీ ట్రిపుల్ ఆర్ మూవీని మాత్రం బిజినెస్ పరంగా బీట్ చేయలేకపోయింది. ఇక బాహుబలి రెండవ భాగం 352 కోట్లు, సలార్ 345 కోట్లు, సాహో 270 కోట్లు, ఆదిపురుష్ 240 కోట్లు, రాధేశ్యామ్ 202.80 కోట్లు, సైరా నరసింహారెడ్డి 187.25 కోట్లు, పుష్ప 144 కోట్లు, గుంటూరు కారం 132 కోట్లతో వరుసగా టాప్ 10 ప్లేసులో ఉన్నాయి.

First Step Raises Questions On Prabhas' Film Kalki 2898 AD!

- Advertisement -

2000 కోట్లు కష్టమేమీ కాదు…

ఇక ప్రస్తుతం జరుగుతున్న చర్చ మొత్తం కల్కి గురించే. దాదాపు 600 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ మూవీ 2000 కలెక్షన్లు రాబట్టగలదా ? అంతకుముందు దాదాపు 2000 కోట్లు కొల్లగొట్టిన బాహుబలి రికార్డులను రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీతో బ్రేక్ చేయలేకపోయాడు. మరి ప్రభాస్ కల్కితో చేయగలడా ? అనేదే అందరి మదిలో ఉన్న ప్రశ్న. అయితే ఇప్పుడు హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ట్రిపుల్ ఆర్, ఆ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న కల్కి మూవీని పోల్చి చూస్తే ఈ టార్గెట్ ను ప్రభాస్ ఈజీగా చేరుకుంటాడు అనిపిస్తోంది.

451 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాలను పోలిస్తే అప్పట్లో ఆర్ఆర్ఆర్ కంటే ఇప్పుడు కల్కికి ఎక్కువ హైప్ ఉంది. ఈ హైప్ తో పోలిస్తే కల్కి కి జరిగిన బిజినెస్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. కల్కి మూవీ 388 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్లలోకి రాబోతోంది. కాబట్టి ఈ సినిమా 200 కోట్లు కొల్లగొట్టడం అనేది పెద్ద కష్టమేమీ కాదు.

kalki-2898-ad-collections-top-10-highest-pre-release-business-movies-in-tollywood
kalki-2898-ad-collections-top-10-highest-pre-release-business-movies-in-tollywood

ఇక మరో బెనిఫిట్ ఏంటంటే అప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాకు ఉన్న టికెట్ ప్రైజ్ వల్ల 1300 కోట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు కల్కికి మరింత కలిసి రాబోతోంది. తెలంగాణలో భారీగా టికెట్ రేట్లు పెరగబోతున్నాయి. ఆంధ్రాలో కూడా చంద్రబాబు ప్రభుత్వం రావడంతో అశ్విని దత్ కి హెల్ప్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చిత్ర బృందం టికెట్ ప్రైజ్  పెంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అనుమతి కోరింది. ఇక అప్పట్లో బాహుబలి 2 మూవీ దాదాపుగా 200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ మూవీతో విషయంలో కూడా బాహుబలి 2 కంటే కల్కికే హైప్ ఎక్కువగా ఉంది. అలాగే బాహుబలి 2 కంటే కల్కికే ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ విషయాలు చాలు కల్కికి 2000 కోట్ల కంటే ఎక్కువగా కలెక్ట్ చేస్తుంది అని చెప్పడానికి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు