Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కల్కి2898AD సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో రచ్చ చేయబోతుంది. విడుదలకు ఇంకా 5 రోజులే ఉన్న నేపథ్యంలో కల్కి చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్లు చేస్తుంది. తక్కువ టైం ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ నిర్వహించడం లేదు. కానీ ఇతర భాషల్లో ఈవెంట్స్, ప్రమోషన్లు చేయబోతున్నారు. ఇక ప్రభాస్ సహా కల్కి చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా కల్కి2898AD మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సహా, సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుని, సినిమాపై అంచనాలు పెంచేయగా, తాజాగా నిన్న (జూన్ 21) రాత్రి 8 గంటలకు కల్కి నుండి రిలీజ్ ట్రైలర్ అంటూ మరో కొత్త ట్రైలర్ వచ్చింది. ఇక లేటెస్ట్గా వచ్చిన అయిన రిలీజ్ ట్రైలర్ దాన్ని మించిపోయిందనే మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. విజువల్స్‌తో పాటు కథలోని ఎమోషన్లు ఎలివేట్ అయ్యేలా ట్రైలర్ కట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఈ ట్రైలర్ తో నెట్టింట ఊహించని రచ్చ మొదలైంది.
హీరోపై కొత్త అనుమానం?
అయితే తాజాగా వచ్చిన కల్కి (Kalki2898AD) రిలీజ్ ట్రైలర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం నిరాశ పడిన సంకేతాలు కనిపిస్తున్నాయి. కల్కి ఫస్ట్ ట్రైలర్లో మాదిరిగా ప్రభాస్ రెండో ట్రైలర్ లో ఎలివేట్ కాలేదని, తన పాత్రకు సంబంధించిన షాట్స్ చాలా తక్కువ ఉన్నాయని, ఎందుకు ప్రభాస్ కు ఎలివేషన్ ఇవ్వలేదని వాళ్లు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐతే నాగి అండ్ కో ఉద్దేశపూర్వకంగానే ప్రభాస్ పాత్రను అండర్ ప్లే చేసి ఉండొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక కల్కికి తెలుగు రాష్ట్రాల్లో కావాల్సినంత హైప్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ను కొత్తగా ఎంగేజ్ చేయాల్సిన అవసరమేమీ లేదు. అయితే తెలుగు రాష్ట్రాల అవతల కల్కికి హైప్ పెంచాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని విజువల్ హైలైట్స్‌ను ఈ ట్రైలర్లో చూపించే ప్రయత్నం జరిగినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ సినిమాకు బజ్ పెంచడం కోసం ప్రభాస్ కంటే అమితాబ్‌ను హైలైట్ చేయడానికి చూశారని తెలుస్తుంది.
అసలు హీరో ప్రభాసా? అమితాబా?
ఇక కల్కి రిలీజ్ ట్రైలర్ లో కథకి సంబంధించిన ఎలివేషన్లు బాగానే ఇవ్వగా, రెండో ట్రైలర్ లో ప్రభాస్ ని తక్కువ సేపు చుపించారన్నది వాస్తవం. ఇక ఈ ట్రైలర్ చూస్తే హీరో ప్రభాసా? అమితాబా? అని సందేహం కలిగే స్థాయిలో బిగ్ బిని ఎలివేట్ చేసే ప్రయత్నం జరిగింది. అలాగే తొలి ట్రైలర్‌తో పోలిస్తే సినిమాలోని కొత్త పాత్రలు, కొత్త విశేషాలను మరింతగా ప్రేక్షకులకు రిజిస్టర్ చేయడానికి చూశారు. అందుకే ప్రభాస్ షాట్స్ తగ్గాయని చెప్పొచ్చు. ఇక సినిమాలో ఎలాగూ ప్రభాస్ బాగా హైలైట్ అయ్యే ఛాన్సుంది, కాబట్టి ట్రైలర్ చూసి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఆల్రెడీ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలయ్యాయని సమాచారం. ఇప్పటికే తెలుగులో RRR తర్వాత ఆ రేంజ్ బిజినెస్ చేసిన కల్కి సినిమా థియేటర్ల వద్ద ఏ రేంజ్ రచ్చ చేస్తుందో తెలియాలంటే జూన్ 27వరకు ఆగాల్సిందే.