Mahesh Babu : రాజకీయాల్లోకి మహేష్ బాబు ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన బాబాయ్..

Mahesh Babu : తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, ఆయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు..ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నా కలెక్షన్స్ ను మాత్రం భారీగానే రాబట్టింది.. ఆ సినిమా వచ్చి దాదాపు 6 నెలలు అయినా కూడా పాటలు మాత్రం ఇప్పటికి ట్రెండ్ అవుతున్నాయి.. ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు రాజకీయాల్లోకి రాబోతున్నాడనే ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది..

మహేష్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సమయం దొరికితే మాత్రం ఫ్యామిలీతో గడుపుతాడు.. ఇటీవల కాలంలో ఎక్కువగా ఫ్యామితో టూర్లకు వెళ్తున్న ఫోటోలను షేర్ చేస్తున్నాడు.. అయితే ప్రస్తుతం మహేష్ బాబు గురించి ఓ వార్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. మహేష్ బాబు రాజకీయాల్లోకి వస్తాడని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.. తాజాగా ఈ విషయం పై మహేష్ బాబు బాబాయి క్లారిటీ ఇచ్చాడు.. ఆయన ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ బాబు రాజకీయాల్లోకి వస్తాడా అని అడగ్గా.. దానికి సమాధానం చెబుతూ.. మహేష్ కు రాజకీయాలు అంటే ఆసక్తి ఉంది కానీ రాజకీయాల్లోకి మాత్రం రాడని చెప్పాడు.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

Babai's shocking comments on Mahesh Babu's entry into politics
Babai’s shocking comments on Mahesh Babu’s entry into politics

ఇక మహేష్ బాబు రాజమౌళి తో సినిమా చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే.. ఆ సినిమా కోసం మహేష్ లుక్ ను కూడా పూర్తిగా మార్చేశాడు.. గడ్డం, పొడవాటి జుట్టుతో మహేష్ బాబు స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈ లుక్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఆల్రెడీ ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.. త్వరలోనే సినిమాకు కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ను ప్రారంభించబోతున్నారని సమాచారం.. ఇక వచ్చే ఏడాది సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. నిజానికి రాజమౌళి సినిమాలు రెండు మూడేళ్లు పడతాయి.. కనీసం మహేష్ సినిమా అయిన త్వరగా వస్తుందేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు