Mishti Chakravarty..ఏ సినీ పరిశ్రమలోకైనా సరే అమ్మాయిలు హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వాలనే ఆశతో అడుగుపెడుతూ ఉంటారు. అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉండగా..మరి కొంతమంది అడపాదడపా సినిమాలతో సినీ ఇండస్ట్రీకి ప్యాకప్ చెప్పేస్తూ ఉంటారు. మొదటి సినిమాతోనే అందం , అభినయంతో ఆకట్టుకొని ఆ తర్వాత సినిమాలో కనుమరుగైన హీరోయిన్లలో మిస్తీ చక్రవర్తి కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా పాపులారిటీ సంపాదించుకుంది.
బెంగాలీ ముద్దుగుమ్మ నితిన్ ద్వారా తెలుగు లోకి అడుగు..
మిస్తీ చక్రవర్తి.. నితిన్ నటించిన చిన్నదాన నీకోసం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. వాస్తవానికి ఈ ముద్దుగుమ్మ బెంగాలీ బ్యూటీ అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల అందరిని ఆకట్టుకుంది. 2013లో పోరీ చెయ్ అనే సినిమాతో బెంగాలీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. అక్కడ మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో తెలుగులో హీరో నితిన్ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. చిన్నదాన నీకోసం సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకున్నప్పటికీ.. తన అమాయకపు చూపులతో నటనతో అందరిని ఆకట్టుకుంది. ఎంతోమంది తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అయ్యారు.
ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం..
మిస్తీ చక్రవర్తి వరుస సినిమాలతో బిజీగా అవుతుందనుకున్నా . ఈ ముద్దుగుమ్మ కేవలం ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి ప్యాకప్ చెప్పేసింది.. బాలీవుడ్ లో కూడా కాంచి అనే సినిమాలో నటించింది.. ఇవే కాకుండా ఇతర భాషలలో కూడా పలు సినిమాలలో నటించింది. అయితే ఈమె నటించిన ఏ చిత్రం కూడా ఈమె కెరీర్ కి పెద్దగా ఉపయోగపడలేదు. మరికొన్ని చిత్రాలలో ఈమె నటించిన.. అవి విడుదలైనా కూడా ఈమె నటించిన విషయం కూడా చాలామందికి తెలియదట. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది.
36 లో కూడా 16 లా మిస్తీ అందం..
చిన్నదాన నీకోసం సినిమాలో చాలా క్యూట్ గా, ముద్దుగా కనిపించిన మిస్తీ చక్రవర్తి .. ఇప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు చాలా సన్నగా మారి మరింత నాజూకుగా తయారయ్యింది. ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చాలాకాలం తర్వాత ఈ ముద్దుగుమ్మను చూసిన అభిమానులు, నెటిజన్ లు సైతం ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం ఈ అమ్మడు ఏజ్ 36 సంవత్సరాలు అయినప్పటికీ.. పదహారేళ్ల అమ్మాయిగా కనిపిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని సందేహం లేదు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు వయసు ముదిరినా కూడా ఇంకా యంగ్ గా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా స్నేహ, సదా , త్రిష , తమన్నా , సమంత, నయనతార ఇలా వీళ్లంతా కూడా 30 సంవత్సరాల వయసు దాటినా.. ఇంకా యంగ్ గా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక మిస్తీ కూడా హీరోయిన్గా మళ్లీ అడుగుపెట్టి సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.. మరి మిస్తీ చక్రవర్తి అభిమానుల కోరిక మేరకు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.
View this post on Instagram