Gautam Ghattamaneni.. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఎంత మంచి పేరు దక్కించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తండ్రి లాగే కొడుకు ఘట్టమనేని గౌతమ్ కూడా అదే బాటలో అడుగులు వేయాలని ప్రయత్నం చేస్తున్నారు.. ఇక అందులో భాగంగానే తాజాగా గౌతమ్ ఘట్టమనేని చేసిన పనికి తల్లి నమ్రత కంటతడి పెట్టుకుంటూ ఒక ప్రౌడ్ మూమెంట్ ని షేర్ చేసింది.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రోమియో జూలియట్ నాటకంలో అదరగొట్టేసిన గౌతమ్..
తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. గౌతమ్ ప్రస్తుతం లండన్ లోనే చదువుతున్నాడు. యాక్టింగ్ కోర్స్ కూడా చేస్తున్నట్టు సమాచారం. తాజాగా మహేష్ భార్య నమ్రత లండన్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసింది. అందులో తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి.. తాజాగా గౌతమ్ రోమియో జూలియట్ నాటకం వేసినట్టు తెలుస్తోంది. నాటకం అయిపోయిన తర్వాత థియేటర్ బయట దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. బ్యూటిఫుల్ ఈవెనింగ్.. లండన్ లో గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ కి తల్లిగా చాలా గర్వపడుతున్నాను. ఈ పర్ఫామెన్స్ ఎంతో అద్భుతంగా ఉంది.. నా కొడుకు చాలా బాగా చేశాడు. పిల్లలందరూ కూడా ఈ సమ్మర్ స్పెషల్ ప్రోగ్రాం కి కచ్చితంగా రావాలి.. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి సరదాగా సాయంత్రాన్ని గడిపాను అంటూ పోస్ట్ చేసింది నమ్రత.. మొత్తానికి అయితే కొడుకు యాక్టింగ్ చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఈ పోస్ట్ చేసింది నమ్రత.
త్వరలోనే ఇండస్ట్రీ ఎంట్రీ..
మొత్తానికి అయితే నటనలో తల్లి వద్ద మంచి మార్కులే కొట్టేశారు గౌతమ్ ఘట్టమనేని.. ఇకపోతే గతంలో కూడా ఒకసారి నాటకం వేసినట్టు నమ్రత తెలిపింది.. గౌతమ్ లండన్ లో యాక్టింగ్ కి సంబంధించిన కోర్సులు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.. ఇక అందులో భాగంగానే గౌతమ్ నాటకం వేసినట్లు తెలుస్తోంది.. ఇది వరకే మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే అనే సినిమాలో గౌతమ్ ..హీరో చిన్నప్పటి పాత్రలో నటించాడు.. సితార కూడా త్వరలోనే సినిమాల్లోకి వస్తానని తెలిపింది. మరోవైపు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ సాంగులో కనిపించింది ఈమె. అయితే యాక్టింగ్ పరంగా స్క్రీన్ ముందుకైతే రాలేదు.. ఇక త్వరలోనే వీరిద్దరూ ఇండస్ట్రీలోకి రాబోతున్నారని స్పష్టమవుతుంది.. మొత్తానికైతే కృష్ణ వారసుడిగా మహేష్ బాబు… ఇప్పుడు మహేష్ వారసులుగా వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇ ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా.. అభిమానులు గౌతమ్ ఘట్టమనేని కి అభినందనలు తెలియజేస్తున్నారు.
మహేష్ బాబు సినిమాలు..
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో పాన్ వరల్డ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీని చేస్తున్నామని.. ఇటీవలే రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర వర్మ తెలిపిన విషయం తెలిసిందే.
View this post on Instagram