Raviteja look : టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హిట్ సినిమాలతో పని లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఈ మధ్య కాలంలో సరైన హిట్ సినిమా హీరో ఖాతాలో పడలేదు.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న మాస్ హీరో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి..
రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి షో రీల్ అని ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసారు.. ఇందులో హీరో ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాడు. ఓ పెద్ద రాజకీయ నాయకుడి ఇంటికి రైడ్ కి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ షో రీల్ లో డైలాగ్స్ ఏం లేకుండా కేవలం యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసాడు రవితేజ. 1990 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ సీన్స్ తో పాటుగా లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది..
ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది, జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఇదిలా ఉండగా తాజాగా రవితేజ లుక్ ఒకటి విడుదల చేసారు.. మిస్టర్ బచ్చన్ లుక్ అంటూ ఒక ఫోటో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. ఆ ఫొటోలో రవితేజ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఇక మిస్టర్ బచ్చన్ నుంచి త్వరలో లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం..