#NKR21 : కళ్యాణ్ రామ్ మూవీ నుండి క్రేజీ అప్డేట్… పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా లేడీ సూపర్ స్టార్..!

#NKR21 : నందమూరి కళ్యాణ్ రామ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. రెండేళ్ల కింద “బింబిసార” తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో డెవిల్ తో వచ్చి ప్లాప్ అందుకున్నా, ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ప్రస్తుతం దేవర సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తన సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం యంగ్ దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో తో తన 21వ సినిమాని చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఎన్టీ రామారావు జయంతి సందర్బంగా ఆ మధ్య మూవీ అనౌన్స్ మెంట్ జరగగా, ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, అశోక క్రియేషన్స్‌ పతాకాలపై భారీ బడ్జెట్‌ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతుంది. కాంతారా ఫేమ్ అంజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కళ్యాణ్ రామ్ స్టైల్ లో పక్కా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది.

Vijayashanthi as police officer in #NKR21 Kalyan Ram movie

పవర్ ఫుల్ రోల్ లో లేడి సూపర్ స్టార్

ఇదిలా ఉండగా ఈ సినిమా (#NKR21) లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లేడి సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీలో కీలక పాత్రను పోషించిన విజయ శాంతి మళ్ళీ నాలుగేళ్లకు ఈ సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాలో విజయశాంతి కళ్యాణ్ రామ్ కు తల్లిగా నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో విజయశాంతి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు మేకర్స్ రివీల్ చేసారు. అయితే ఆ పాత్రకి సంబంధించిన వివరాలు రేపు (జూన్ 24) న విజయశాంతి పుట్టినరోజు స్పెషల్ గా రివీల్ కానుంది. ఇక ఆ సినిమాకి సంబంధించి రేపు ఉదయం 10.49 గంటలకు విజయశాంతి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రివీల్ చేయనున్నారు మేకర్స్. బహుశా డిజిపి, లేదా ఎస్పీ ఆఫీసర్ గా ఆ పాత్ర ఉండొచ్చు. ఇక ఈ సినిమాలో విజయశాంతి భాగం అయ్యాక సినిమాకి మరింత హైప్ వచ్చిందని చెప్పొచ్చు.

- Advertisement -

నాన్ స్టాప్ గా షూటింగ్…

ఇక నందమూరి కళ్యాణ్  రామ్ హీరోగా నటిస్తూనే, తాను నిర్మాతగానూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు నిర్మాతగా ఏకంగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రెండు సినిమాలు నిర్మిస్తూ, తాను హీరోగా మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక nkr21 లో సినిమాలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ హీరోయిన్ ఇప్పటికే హీరోయిన్ గా మేజర్ సినిమాతో హిట్ కొట్టినా, మిగతా రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఈ సినిమాతో కం బ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. అలాగే డెవిల్ తో ప్లాప్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ రివీల్ చేయనున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు