Vijayashanti : వైజయంతి IPS – ఎన్నాళ్లైంది ఈమెను ఇలా చూసి… ఇక సుర్రు సుమ్మైపోవాలే

Vijayashanti: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో లేడీ సూపర్ స్టార్ గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను దక్కించుకుంది ఈ బ్యూటీ. స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇచ్చేది విజయశాంతి. తన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టేవి. ఈ బ్యూటీ ఒకప్పుడు స్టార్ అగ్ర హీరోలు అందరి సరసన హీరోయిన్గా నటించింది. లేడీ సూపర్ స్టార్ గా మంచి ఇమేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ సినిమాలకు దూరమై రాజకీయాల్లో అరంగేట్రం చేసింది.

దాదాపు ఈ బ్యూటీ ఇండస్ట్రీలో 15 ఏళ్లకు పైగానే చక్రం తిప్పింది. ఇక చాలా రోజులు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ మళ్లీ సినిమాల్లోకి కొద్ది రోజుల క్రితమే రీఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీలకపాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాల్లో నటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ బ్యూటీ సినిమాల్లో నటించినని చెప్పింది. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాలో కీలకపాత్రలో నటించబోతుంది. తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాలో విజయశాంతికి ఓ ప్రత్యేకమైన పాత్రను ఇచ్చింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇందులో విజయశాంతి పోలీస్ గెటప్ లో అదరగొట్టింది. “తనే ఒక యుద్ధం….మేమే తన సైన్యం” అంటూ ఈ టీజర్ లో కళ్యాణ్ రామ్ వాయిస్ ఇచ్చారు. మొత్తానికి ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ టీజర్ ను విజయశాంతి బర్త్డే కానుకగా రిలీజ్ చేశారు.

- Advertisement -

Vijayashanthi : పోలీసాఫీసర్ గా విజయశాంతి.. లేడీ సూపర్ స్టార్ ఈజ్ బ్యాక్.. | Vijayashanthi power full police officer role in kalyan ram movie birthday glimpse released-10TV Telugu
వాస్తవానికి ఒకప్పుడు విజయశాంతి ఇమేజ్ను మార్చేసింది కూడా పోలీస్ పాత్రలే. కర్తవ్యం, శత్రువు, శాంభవి, ఐపీఎస్ స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్, పోలీస్ లాకప్ వంటి వివిధ రకాల చిత్రాల్లో ఆమె పోలీస్ గెటప్ లో కనిపించి మెప్పించింది. విజయశాంతి చాలా వరకు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో పోలీస్ పాత్రలే కావడం విశేషం. కేవలం పోలీసు పాత్రలు మాత్రమే విజయశాంతికి సూపర్ స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చాయి. కాగా నందమూరి కళ్యాణ్‌ రామ్‌ NKR21 సినిమా షూటింగ్‌ దశలో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు