Kalki 2898 AD : ప్రభాస్ ఊచకోత… టికెట్ బుకింగ్ యాప్ లో అరుదైన ఫీట్

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో రెండు రోజుల్లో కల్కి 2898 ఏడీ మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే మూవీపై ఎంత హైప్ ఏర్పడిందంటే మొదటి రోజే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాస్ ఊచకోత ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలిపేలా కల్కి విషయంలో ఓ కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. టికెట్ బుకింగ్ యాప్ లో మరో అరుదైన ఫీట్ సాధించాడు డార్లింగ్. మరి తాజా రికార్డు సంగతి ఏంటో చూసేద్దాం పదండి.

టికెట్ బుకింగ్ యాప్ లో కొత్త రికార్డు…

ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. బుకింగ్స్ అలా ఓపెన్ అయ్యాయో లేదో గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడై, థియేటర్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఇక తాజాగా బుక్ మై షోలో ఈ మూవీ 1 మిలియన్ ఇంట్రెస్ట్ లు దాటేసి మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది ఎఏ మూవీ. ఇప్పటికే ఈ కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 400 కోట్లు జరగడం విశేషం. అలాగే కల్కి రిలీజ్ ట్రైలర్ కూడా భారీ సంఖ్యలో వ్యూస్ రాబట్టి యూట్యూబ్లో ట్రెండింగ్ లో ఉంది. తాజాగా బుక్ మై షోలో మరో రికార్డు క్రియేట్ చేసి చరిత్ర సృష్టించడంతో రిలీజ్ కి ముందే కల్కి రికార్డుల ఊచకోత మొదలైంది అంటూ అంటూ డార్లింగ్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.

Prabhas Fan (@ivdsai) / X

- Advertisement -

ఒక్క దెబ్బతో పెరిగిన హైప్..

నిజానికి ఒకానొక టైంలో ఈ మూవీ గురించి ఎదురు చూసి చూసి ప్రేక్షకులకు విసుగు వచ్చేలా చేశారు మేకర్స్. ఇక ఆ తర్వాత రిలీజ్ చేసిన కంటెంట్ పెద్దగా అట్రాక్టివ్ గా అనిపించలేదు. ఫలితంగా కల్కి ఫస్ట్ ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. దీంతో పాటు చిత్ర బృందం పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టకపోవడంతో ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడ్డారు. ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ మూవీగా తెరకెక్కుతున్న కల్కికి రాజమౌళి రేంజ్ లో ప్రమోషన్స్ చేయాలి. కానీ నాగ్ అశ్విన్ అవి ఏమీ చేయకుండా సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ లో నీరు గారుస్తున్నాడు అనే విమర్శలు వినిపించాయి. కానీ నాగీ మాత్రం ఎవ్వరి మాట వినకుండా తన స్ట్రాటజీని అమలు చేశాడు. ఫలితంగా సెకండ్ ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాకాయి. దానికి నిదర్శనమే తాజాగా బుక్ మై షోలో వన్ మిలియన్ కు పైగా ఇంట్రెస్ట్ లు పెరిగిపోవడం. మొత్తానికి సినిమాపై ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ కావడానికి కేవలం కల్కి సెకండ్ ట్రైలరే కారణమని చెప్పొచ్చు. ఇదంతా చూస్తుంటే కల్కి 2000 కోట్ల రికార్డులను బద్దలు కొట్టడం ఎవ్వరూ ఆపలేరు అనిపిస్తోంది. మరి మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు