Nagarjuna : సంస్కారం అంటే ఇదీ… స్టార్ హీరోతో పోలుస్తూ నాగ్ పై ట్రోలింగ్

Nagarjuna : సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుంచి నాగార్జునకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఒక స్టార్ హీరోతో అక్కినేని నాగార్జునను పోలుస్తూ సీనియర్ హీరో అని కూడా చూడకుండా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎవరితో నాగ్ ను పోలుస్తున్నారు? అతను నాగ్ కంటే ఏ రకంగా బెటర్? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అభిమానిని తోసేసిన వివాదం

తాజాగా ఎయిర్ పోర్ట్ లో నాగార్జున కనిపించగా, అభిమానులు ఆయనతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. నాగ్ చకచకా నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ ఆయన పాటే పరిగెత్తి సెల్ఫీలు తీసుకోవాలని ట్రై చేశారు. అయితే చుట్టూ గుమ్మి కొడుతున్న జనం నుంచి కాపాడడానికి ఆయన సెక్యూరిటీ గార్డులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఓ వ్యక్తి నాగ్ తో ఫోటో దిగడానికి దూసుకొచ్చేసాడు. దీంతో కంగారు పడ్డ నాగ్ సెక్యూరిటీ గార్డ్ వెంటనే అతని ఆపడానికి ట్రై చేశాడు. గార్డు తన బలాన్నంతా ఉపయోగించడంతో ఆ ఫోర్స్ తో తోసేసినట్టుగా అయ్యి, బక్క పలచగా ఉన్న సదరు వ్యక్తి దాదాపు ఎగిరి కింద పడినంత పని అయ్యింది. కానీ పడపోకపోవడంతో వెంటనే రియాక్ట్ అయిన నాగ్ కూడా సైలెంట్ గా అక్కడి నుంచి వచ్చేసాడు.

nagarjuna-netizens-comparing-nagarjuna-and-yash-behavior

- Advertisement -

అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఇతర హీరోల అభిమానులు. నిజానికి నాగ్ ఈ సంఘటనపై స్వయంగా రియాక్ట్ అయ్యి తన అభిమానికి సారీ కూడా చెప్పాడు. సెక్యూరిటీ గార్డ్ చేసిన పనికి బహిరంగంగానే క్షమాపణలు కోరారు. అయినప్పటికీ ఈ వివాదం ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. ఇక తాజాగా కన్నడ స్టార్ హీరో యష్ తో నాగార్జునను పోలుస్తూ సంస్కారం అంటే ఇలా ఉండాలి అంటూ పాఠాలు చెబుతున్నారు.

యష్ తో పోలిక ఏంటి?

యష్ ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు తన అభిమానులతో సెల్ఫీలు దిగేటప్పుడు, అలాగే వాళ్ళను కలిసేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అని తెలిపే వీడియోలను పోస్ట్ చేస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఒక అమ్మాయి ఎస్ తో ఫోటోలు దిగుతుండగామ్ సెక్యూరిటీ గార్డ్ ఆమె తలపై చేయి పెట్టి సున్నితంగా పక్కకు నెట్టాడు. అయితే యష్ అలా చేయొద్దని వారించాడు. ఆ తర్వాత మరో అభిమాని వచ్చి కాళ్లు పట్టుకుంటే వెంటనే తీసేసి అలా చేయొద్దని చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియోలను మన హీరోల వీడియోలతో పోలుస్తూ రియల్ హీరోలంటే ఇలా ఉంటారు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కానీ నిజానికి హీరోలందరూ కావాలని అలా చేయరు. సడన్ గా అలా మీదకి దూసుకొస్తే యష్ సెక్యూరిటీ గార్డులైన, ఇంకెవరి హీరోల గార్డులైనా ఇలాగే ప్రవర్తిస్తారు అంటూ అక్కినేని అభిమానులు నాగ్ ను సపోర్ట్ చేస్తున్నారు. పైగా ఆయన సారీ చెప్పినప్పటికీ ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదంటూ మండి పడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు