Akira Nandan: పవన్ కళ్యాణ్ తన కొడుకుకి ఆ పేరే ఎందుకు పెట్టారంటే..?

Akira Nandan.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అటు సినిమాలు , ఇటు రాజకీయాలు అంటూ చాలా బిజీగా గడిపేస్తున్న విషయం తెలిసిందే.. దాదాపు 13 సంవత్సరాల నిర్విరామ శ్రమకు ఫలితం లభించింది.. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని , అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తన కొడుకు అకీరానందన్ తో కలిసి పవన్ కళ్యాణ్ వారిని అభినందించడం జరిగింది. అయితే ఈ సమయంలో తండ్రి వెంటే ఉంటూ.. అకిరానందన్ ఒక హాట్ టాపిక్ గా మారారు.

13 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం..

నిజానికి పవన్ కళ్యాణ్.. రేణూ దేశాయ్ తో కొంతకాలం డేటింగ్ చేసి అకీరాకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ ఆమెను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కూతురు జన్మించిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.. దీంతో పిల్లలు ఇద్దరిని తీసుకొని ముంబైలో సెటిల్ అయిపోయింది.. అక్కడే తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు వీరిని పరిచయం చేస్తూనే వచ్చింది.. కానీ ఎప్పుడూ కూడా నేరుగా వీరు మీడియా ముందుకు రాలేదు.. అయితే ఇప్పుడు తన తండ్రి ఉపముఖ్యమంత్రి కావడంతో దేశవ్యాప్తంగా అకిరానందన్ పాపులారిటీ సంపాదించుకున్నారు.. ఈ క్రమంలోని అకీరాకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి..

ఆయనపై అభిమానంతో కొడుకుకు పేరు..

Akira Nandan: Why Pawan Kalyan named his son that name..?
Akira Nandan: Why Pawan Kalyan named his son that name..?

సాధారణంగా ఏ ఒక్కరైనా సరే తమ పిల్లలకు పేర్లు పెట్టడంలో ఎన్నో జాగ్రత్తలు.. ఎన్నో విషయాలను పరిశీలిస్తారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన కొడుకుకి పేరు పెట్టడం వెనుక ఒక పెద్ద కథే ఉందట. ఇంతకు పవన్ కళ్యాణ్ తన కొడుకుకి అకీరా నందన్ అనే పేరు పెట్టడానికి గల కారణం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ కు జపనీస్ ఫిలిం మేకర్ “అకీరా కురోసవ” అంటే చాలా ఇష్టమట.. అందుకే ఆయన మీద ప్రేమతో తన కొడుకుకి ఆయన పేరును పెట్టుకున్నారు.. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక ఫిలిం మేకర్ పైన తన అభిమానాన్ని ఏకంగా కొడుకుకి పేరు పెట్టి నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్.

- Advertisement -

ఇటు రాజకీయం.. అటు సినిమా.. బ్యాలెన్స్ చేస్తారా…

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.. కానీ మరొకవైపు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరి ఇలాంటి సమయంలో ఇక్కడ ఈ పదవికి ..అక్కడ ఈయనను నమ్ముకున్న దర్శక నిర్మాతలకు ఏ విధంగా న్యాయం చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది రెండు పడవల మీద ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఎలా తన ప్రయాణాన్ని పూర్తి చేస్తారో ప్రశ్నార్ధకంగా మారింది. ఇకపోతే ఇప్పటికే వారంలో రెండు రోజులు సినిమా షూటింగ్లకు… మిగతా నాలుగు రోజులు ప్రజల కోసం కేటాయిస్తానని చెప్పిన పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు