Amitabh Bachchan: తనపై దాడి చేయొద్దు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కు అమితాబ్ రిక్వెస్ట్… వివాదం ఏంటంటే?

Amitabh Bachchan : బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి మూవీ రిలీజ్ దగ్గర పడుతుంది. జూన్ 27న ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కలిసి తాజాగా ఒక్క చోట చేరి ముచ్చటించారు. అందులో పలు ఇంట్రెస్టింగ్ సినిమా విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమితాబ్ ప్రభాస్ అభిమానులు తనపై దాడి చేయొద్దు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ను వేడుకున్నారు. మరి ఇంతకీ అసలు వివాదం ఏంటి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

వివాదం కాదు బిగ్ బీ చమత్కారం

తాజాగా జరిగిన ఈ స్టార్ మీట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, ఉలగనాయగన్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో పాటు నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ కల్కి సినిమాలో తాను ప్రభాస్ ను కొట్టే సీన్లు ఉన్నాయనే విషయాని వెల్లడించారు. నిజానికి రీసెంట్ గా రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ లోనే ఆ విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్. అయితే తాజాగా అమితాబ్ మాట్లాడుతూ నాగి తన దగ్గరకు వచ్చి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు తాను, ప్రభాస్ సినిమాలో ఎలా కనిపిస్తాము అనే విషయాన్ని తెలియజేసేలా కొన్ని ఫోటోలు చూపించారని గుర్తు చేసుకున్నారు.

Amitabh Bachchan Apologises to Prabhas' Fans Before Kalki 2898 AD Release: 'Don't Massacre Me' | Here's Why - News18

- Advertisement -

సినిమాలో ప్రభాస్ ను కొట్టే భారీ వ్యక్తిని నేను. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నన్ను క్షమించాలని చేతులు జోడించి అడుగుతున్నాను. అలాగే క్షమాపణలు కోరుతున్నా.. సినిమాలో నేను ఏం చేశానో చూసి నాపై దాడి చేయొద్దు అంటూ అమితాబ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వెంటనే ప్రభాస్ రియాక్ట్ అవుతూ వాళ్ళందరూ మీ అభిమానులే అని చమత్కరించారు. దీంతో అమితాబ్ మాటలకు అందరూ సరదాగా నవ్వేశారు. ఇక ఈ సందర్భంగా అశ్వద్ధామ పాత్రను పోషించిన అమితాబ్ దక్షిణాది సినీ పరిశ్రమను ఆకాశానికి ఎత్తేశారు. సౌత్ సినీ ఇండస్ట్రీ క్రమ శిక్షణతో ఉంటుందని, సెట్స్ ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా ఉండేదని అమితాబ్ చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రభాస్ క్యారెక్టర్ ఇదే

ఇక ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చారు. కల్కి 2898 ఏడి సినిమాలో తాను చేసిన ఈ క్యారెక్టర్ కెరీర్ లోనే బెస్ట్ అని అన్నారు ప్రభాస్. అలాగే తన పాత్రలో సూపర్ హీరో, ఫన్నీ, గ్రే షేడ్స్ అన్ని కలగలిపి ఉంటాయని వివరించారు. ఇక రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ హీరోనా, కాదా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మరి సినిమాలో మేకర్స్ ఎలాంటి ట్విస్ట్ రివీల్ చేస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు