Akkada Ammayi Ikkada Abbayi: 28 ఏళ్ళు తర్వాత ఆ అబ్బాయిని ఈ అమ్మాయి మళ్ళీ కలిసింది

Akkada Ammayi Ikkada Abbayi: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు పవన్ కళ్యాణ్. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించుకుంది. అయితే ఈ సినిమాతో చిరంజీవి తమ్ముడుగా పరిచయం అయ్యాడు పవన్. కానీ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానుల్ని ఏర్పరచుకొని, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పేరుని నిలబెడుతూ వచ్చాడు.

 Akkada ammayi ikkada abbayi

ఈ సినిమా అక్టోబర్ 11, 1996న విడుదలైంది. ఈ సినిమాను అప్పట్లో పవన్ కళ్యాణ్ చాలా తక్కువ రెమ్యూనరేషన్ కి చేశాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే దాదాపు 50 కోట్లకు పైగా ఉంటుంది. అప్పటికే హిందీలో వచ్చి హిట్టైన ఖయామత్ సే ఖయామత్ తక్ అనే సినిమాను తెలుగులో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చి రీమేక్ చేశారు ఇవివి సత్యనారాయణ.

- Advertisement -

ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబంధించి నెలకు 5000 రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చాడు. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చేశారు ఇవివి సత్యనారాయణ. ఇదే సినిమాతో అక్కినేని వారసురాలు నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ కూడా పరిచయమయ్యారు. ఇకపోతే అన్నపూర్ణ స్టూడియోలో తెరకెక్కే కొన్ని సినిమాలలో ప్రముఖ పోషిస్తుంది సుప్రియ. ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలామంది తెలుగు సినిమా నిర్మాతలు పవన్ ను కలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి చెప్పుకున్నారు. ఈ తరుణంలో సుప్రియ కూడా పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఆ అబ్బాయిని ఈ అమ్మాయి కలిసింది అంటూ షేర్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు