Amritha Aiyer : ఆరెంజ్ కలర్ డ్రెస్సులో హనుమాన్ బ్యూటీ అందాలు అదరహో..

Amritha Aiyer : ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బాస్టర్ మూవీ హనుమాన్ సినిమా హీరోయిన్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది.. ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది.. తమిళ సినిమాల్లో నటించింది.. కానీ అంత హిట్ టాక్ ను సొంతం చేసుకోలేక పోయాయి.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.. ఒక్క హనుమాన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి.. అయినా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా ట్రెండీ వేర్లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

amritha ayier latest photos viral in social media
amritha ayier latest photos viral in social media

ఈ ఏడాది హనుమాన్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈమెకు సినిమా ఆఫర్స్ క్యూ కడుతున్నాయని తెలుస్తుంది. ఈ అమ్మడు పుట్టింది తమిళనాడు లో అయిన పెరిగింది మాత్రం కర్ణాటకలో అని చాలా మందికి తెలియదు.. డిగ్రీ వరకు చదువుకున్న అమృత తర్వాత మోడలింగ్ పై ఫోకస్ పెట్టింది.. తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తుంది.. గతంలో స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ అవి పెద్దగా హిట్ అవ్వలేదు..

amritha ayier latest photos viral in social media
amritha ayier latest photos viral in social media

టాలీవుడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన రెడ్‌లో రామ్ పోతినేనికి జోడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా అనుకున్న పేరును తీసుకురాలేదు.. ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో నటించింది.. అదే ఏడాది విష్ణు సరసన అర్జున ఫాల్గుణ మూవీలో నటించింది. ఈ ఏడాది హనుమాన్ చిత్రంలో తేజా సజ్జా జోడిగా నటించింది.. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్సులో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు