Kamal Haasan : తమిళ హీరో, విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.. ఈయన సినిమాలకు ఎంతగా అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం ఈయన తెలుగులో కల్కి సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. కల్కి సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు టీమ్ ప్రయత్నాలు చేస్తుంది..
ఈ క్రమంలో తాజాగా ఓ చిట్ చాట్ వీడియోను కల్కి టీమ్ రిలీజ్ చేశారు.. ఆ వీడియోలో కమల్ హాసన్ మాట్లాడిన ఓ పాయింట్ పై డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఆడేసుకుంటున్నారు.. ఈ స్పెషల్ చిట్ చాట్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలపగా కమల్ హాసన్, అమితాబ్ తాము యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చేసిన సినిమాలు, అప్పటి పరిస్థితుల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.. ఇందులో భాగంగా కమల్ హాసన్ కృష్ణం రాజు గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది..
ఈ వీడియోలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈ సందర్బంగా ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా వివరించారు.. అలాగే ప్రభాస్ పెద్దనాన్న గారు కృష్ణం రాజు గురించి నాకు బాగా తెలుసు.. నేను ఆయనతో కలిసి పనిచేసాను.. నేను డ్యాన్స్ అసిస్టెంట్ గా పనిచేసేటప్పుడు ఆయన హీరోగా చేస్తున్నారు. కృష్ణం రాజు చేస్తున్న ఒక సినిమాకు నేను డ్యాన్స్ అసిస్టెంట్ గా వర్క్ చేశాను. ఆయనకు స్టెప్పులు ఇస్తుంటే ఇలాంటి కష్టమైన స్టెప్స్ ఇవ్వకు అని భయపెట్టేవాళ్ళు. ఆయనకు అంతగా డ్యాన్స్ రాదు. అందుకే నన్ను సరదాగా భయపెట్టేవాళ్ళు. కష్టమైన స్టెప్స్ ఇస్తే నీ పని చెప్తా అని వార్నింగ్ ఇచ్చేవాళ్ళు అని అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నారు.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో పై ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజులో ఆడేసుకుంటున్నారు.. ఇప్పుడు చెప్పడం అవసరమా అని కామెంట్ల తో రచ్చ చేస్తున్నారు..