Karan Johar : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్ కు బ్రేక్ పడిందని సమాచారం. స్వయంగా సమస్య ఏంటో చెబుతూ కరణ్ జోహార్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే షోకు బ్రేక్ పడడానికి కారణం ఏంటో తెలిస్తే నవ్వుకుంటారు. మరి ఆ రీజన్ ఏంటో తెలుసుకుందాం పదండి.
వివాదాస్పద షోకు బ్రేక్
అత్యంత ప్రజాదరణ పొందిన చాట్ షోలలో ‘కాఫీ విత్ కరణ్’ ఒకటి. సాధారణంగా అభిమానులు తమ అభిమాన తారల గురించి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. హీరోయిన్ల క్రష్‌లు, ప్రేమ జీవితం, ఇష్టమైన ఆహారం, సందర్శించాల్సిన ప్రదేశాలు మరెన్నో తెలుసుకోవాలని అనుకుంటారు. అలా అభిమానుల ఆసక్తినే తన షోగా మలచుకున్నాడు కరణ్. ఈ షోకు సినీ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో ఎనిమిది సీజన్లు ఇప్పటివరకు వచ్చాయి. ఇప్పుడు తొమ్మిదో సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కరణ్ ఈ షో నెక్స్ట్ షోకు బ్రేక్ పడిందనే విషయాన్ని తాజాగా వెల్లడించారు. అయితే షో శాశ్వతంగా ఆగిపోవట్లేదు. కానీ 9వ సీజన్ కు మాత్రం గ్యాప్ తీసుకోబోతున్నారు. ఎంతోమంది ప్రముఖులను వివాదాల్లోకి నెట్టిన కాఫీ విత్ కరణ్ షోలో మాట్లాడడానికి సెలబ్రిటీలు భయపడుతున్నారట. అందుకే నెక్స్ట్ సీజన్ కోసం గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.
కరణ్ జోహార్ ఇటీవలి ఇంటర్వ్యూలో కాఫీ విత్ కరణ్ నెక్స్ట్ సీజన్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. ఈ ఏడాది విరామం తీసుకుంటామని, 2025లో కొత్త సీజన్‌తో తిరిగి వస్తామని కరణ్ చెప్పాడు. వచ్చే దాడి కొత్త సింటాక్స్‌తో వస్తామని చెప్పారు. గత సీజన్ ర్యాపిడ్ ఫైర్ చరిత్రలో అత్యంత బోరింగ్ అని కూడా ఆయన అన్నారు. కాఫీ విత్ కరణ్ సీజన్ 9తో ప్రపంచాన్ని మార్చాలని నిర్ణయించుకున్నానని, నెక్స్ట్ సీజన్ వినోదం, గాసిప్, అన్ని రకాల ఉత్తేజకరమైన కంటెంట్ తో ఉంటుందని హామీ ఇచ్చారు కరణ్. బహిరంగంగా మాట్లాడేందుకు ప్రజలు భయపడుతున్నారని, అందుకే 2024లో విరామం తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నానని స్పష్టం చేశారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కరణ్ షో
నెపోటిజం సమస్య నుండి పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్ల ప్రేమ, జీవిత సమస్యల వరకు, బాలీవుడ్‌లోని అనేక సమస్యలు ఐకానిక్ సోఫాకు నెలవైన కాఫీ విత్ కరణ్ షో నుంచే ప్రారంభమయ్యాయి. అలాగే అతను ఈ షోకు సంబంధించి చాలాసార్లు ట్రోలింగ్‌కు గురయ్యాడు. అందులో వాళ్ళు డిస్కస్ చేసే విషయాలు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ నుంచి ఎఫైర్లు, బెడ్ రూమ్ దాకా ఉండడమే అందుకు కారణం.
సీజన్ 8లో దీపికా బలి
కాఫీ విత్ కరణ్ ఎనిమిదో సీజన్ చాలా వివాదాస్పదమైంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్లో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ వచ్చారు. వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. అలాగే ఈ ఎపిసోడ్ ప్రజలకు నచ్చలేదు. ఈ ట్రోలింగ్ వల్లే సెలబ్రిటీలు ఎవ్వరూ షోలో పాల్గొనడానికి ముందడుగు వేయకపోవడంతో కరణ్ వెనక్కి తగ్గుతున్నాడు అని నవ్వుకుంటున్నారు నెటిజన్లు.