Sreeleela : రొమాంటిక్ హీరో చేతిలో పడ్డ శ్రీలీల… బీటౌన్‌లో అయినా నిలదొక్కుకుంటుందా..?

Sreeleela : టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి అందరికీ తెలుసు.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో ఆ తర్వాత వరుస హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది.. కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకోవడంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకుంది.. అయితే ఈ అమ్మడు ఇప్పటివరకు తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది.. ఇప్పుడు స్టార్ హీరో సినిమాతో బీటౌన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..

తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. హిట్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది.. అయితే ఏవో రెండు, మూడు సినిమాలు మాత్రమే హిట్ టాక్ ను అందుకోగా మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. అయితే ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శ్రీలీల ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తుంది.. మొన్న రవితేజ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చింది.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్..

Srileela is going to enter Bollywood with Varun Dhawan's movie
Srileela is going to enter Bollywood with Varun Dhawan’s movie

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని ఓ వార్త బీటౌన్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అయితే గతంలో ఈ అమ్మడు ఇభ్రహీం అలీఖాన్ తో కూడా ఓ సినిమా చేయబోతుందని వినిపించాయి.. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో సినిమాలో చేయబోతుందని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.. ఇక శ్రీలీల సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు