Tollywood Movies : హైదరాబాద్లో ఫస్ట్ డే వెయ్యికి పైగా షోలు ప్రదర్శించిన సినిమాలు..

Tollywood Movies : తెలుగులో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమా మొదలైనప్పటి నుంచి థియేటర్లలోకి వచ్చి వెళ్లెవరకూ ఎలాంటి రచ్చ చేస్తారో చూస్తూనే ఉంటాం.. ఇక స్టార్ హీరోల సినిమాల మొదటి రోజు బాక్సాఫీస్ రికార్డుల మోత మోగిపోవాల్సిందే.. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ డే వెయ్యికి పైగా షోలు ప్రదర్శించిన సినిమాలు, కలెక్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Telugu movie which performed more than a thousand shows on the first day in Hyderabad..
Telugu movie which performed more than a thousand shows on the first day in Hyderabad..

సాహో..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, సుజిత్ కాంబినేషన్లో వచ్చిన భారీ యాక్షన్ సినిమా సాహో.. ఈ సినిమా బాహుబలి తర్వాత రావడంతో దానిపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. మొదటి రోజు హైదరాబాద్ లో వెయ్యికి పైగా షోలు ప్రదర్శించబడ్డాయి.. కానీ సినిమా జనాలకు అర్థం కాలేదు.. దాంతో ప్లాప్ అయ్యింది.. ఇక మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ. 36.52 కోట్లు రాబట్టింది..

- Advertisement -

సరిలేరునీకెవ్వరూ..

మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరూ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. మొదటి రోజు ఈ సినిమాకు హైదరాబాద్ లో వెయ్యికి పై షోలు పైగా పడ్డాయి.. మొదటి రోజు రూ. 46.77 కోట్లు రాబట్టింది..

వకీల్ సాబ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ వకీల్ సాబ్.. ఈ సినిమా కూడా మొదటి రోజు హైదరాబాద్ లో 1000 కి పైగా థియేటర్లో ప్రదర్శించబడింది.. ఇక మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే.. రూ. 42 కోట్ల వరకు రాబట్టింది..

భీమ్లా నాయక్..

పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా భీమ్లా నాయక్.. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు.. ఈ సినిమాను కూడా హైదరాబాద్ లో 1000 కి పైగా షోలను ప్రదర్శించబడింది.. మొదటి రోజు రూ.52.1 కోట్లు కలెక్ట్ చేసింది…

RRR..

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ట్రిపుల్ ఆర్ . రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా హైదరాబాద్ లో 1000 కి పైగా మొదటి షోలు ప్రదర్శించబడ్డాయి.. అంతేకాదు సినిమా మొదటి రోజు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. మొదటి రోజు కలెక్షన్స్ ను చూస్తే.. 222 కోట్లకు పైగా వసూల్ చేసింది..

సర్కారి వారి పాట..

ప్రిన్స్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా నటించారు.. డైరెక్టర్ పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా సాలిడ్ హిట్ ను అందుకుంది.. ఈ సినిమా మొదటి రోజు 1000 కి పైగా థియేటర్లలో ప్రదర్శించారు.. మొదటి రోజు కలెక్షన్స్ ను చూస్తే.. రూ. 180 కోట్లను రాబట్టింది..

వీరసింహారెడ్డి..

నందమూరి హీరో బాలయ్య నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ వీరసింహారెడ్డి.. ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా మొదటి రోజు 1000కి పైగా సినిమా హాల్లలో ప్రదర్శించబడింది.. మొదటి రోజు కలెక్షన్స్ విషయానికొస్తే.. రూ. 134 కోట్లకు పైగా వసూల్ చేసింది..

ఆదిపురుష్ …

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్.. ఈ సినిమా రామాయణం కథతో వచ్చింది.. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు.. ఆ సినిమాను కూడా మొదటి రోజు 1000కి పైగా థియేటర్లలో ప్రదర్శించారు.. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. రూ. 86 కోట్లకు పైగా వసూల్ చేసింది.

సలార్…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.. ఈ సినిమా కూడా 1000 కి పై షోలు ప్రదర్శించబడ్డాయి.. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. రూ . 90 కోట్లకు పైగా వసూల్ చేసింది..

గుంటూరు కారం..

మహేష్ బాబు , శ్రీలీల జంటగా నటించిన సినిమా గుంటూరు కారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.. ఈ సినిమాను మొదటి రోజు వెయ్యికి పైగా థియేటర్లలో ప్రదర్శించారు.. కలెక్షన్స్ విషయానికొస్తే.. 90 కోట్లకు పైగా వసూల్ చేసింది.. అంతేకాదు మిక్స్డ్ టాక్ ను అందుకుంది..

కల్కి 2898 ఏడి..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ కల్కి.. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది.. ఈ సినిమాకోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను కూడా 1000 థియేటర్లకు పైగా షోలను ప్రదర్శించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటివరకు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మరి ఎలాంటి కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు