Tamayo Perry Dies : షార్క్ ఎటాక్ తో పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ నటుడు మృతి

Tamayo Perry Dies :  సూపర్‌హిట్ హాలీవుడ్ చిత్రం ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ నటుడు టామాయో పెర్రీ హవాయిలో కన్నుమూశారు. 49 ఏళ్ల వయసులో ఉన్న టామాయో మరణంతో హాలీవుడ్ పరిశ్రమ షాక్‌కు గురైంది. తమయో పెర్రీ చాలా హాలీవుడ్ చిత్రాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఆయన జూన్ 23న ఆయనపై షార్క్ దాడి చేసిందని, ఆ తర్వాత ఆమె ఆసుపత్రి చేర్చినా ఫలితం లేకపోయిందని సమాచారం.

టామాయోపై షార్క్ దాడి

హోనోలులు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ ప్రకారం, ఆదివారం, జూన్ 23 మధ్యాహ్నం హవాయి ద్వీపంలోని ఓహు సమీపంలో ఉన్న గోట్ ఐలాండ్ దగ్గరలో టామాయో షార్క్ దాడికి గురయ్యాడు. షార్క్ దాడి తర్వాత ఆయనను గమనించిన స్థానికులు ఎమర్జెన్సీకి కాల్ చేయగా, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అతనిని తమ జెట్ స్కీలో ఒడ్డుకు చేర్చారు. తరువాత టామాయో పెర్రీని హోనోలులు ఎమర్జెన్సీలో చేర్చారు. టామాయో పెర్రీ గోట్ ఐలాండ్‌లో సముద్ర భద్రతా లైఫ్‌గార్డ్‌ అండ్ సర్ఫింగ్ శిక్షకులతో కలిసి పని చేస్తున్నారు. భద్రత ఉన్న తర్వాత కూడా షార్క్ అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందని స్థానికులు తెలిపారు. అయితే సమాచారం ప్రకారం టామాయో బీచ్‌లోనే మరణించాడు. అతని శరీరమంతా చాలా చోట్ల షార్క్ తీవ్రంగా కరిచిన గాట్లు ఉన్నాయి. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం. టామాయో మృతి నేపథ్యంలోనే ఓషన్ సేఫ్టీ బీచ్‌ను అధికారికంగా మూసివేసింది. అలాగే ప్రజలు ఆ బీచ్ కు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

Surfing legend and Pirates of the Caribbean star, Tamayo Perry is killed in shark attack as his body is washed up with an arm and leg missing

- Advertisement -

టామాయో కాలు, చేయి మాయం

మీడియా కథనాల ప్రకారం ఈ ప్రమాదంలో టామాయో ఒక చేయి, ఒక కాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. మలేకహనా బీచ్‌లో టామాయో  మృతదేహం లభ్యమైంది. షార్క్ అతని శరీరం నుండి ఒక కాలు, ఒక చేతిని కొరికేయడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఆయన ఆకస్మిక మృతి పట్ల సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన గురించి తెలిసిన హాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆయనతో కలిసి నటించిన నటీనటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు ఈ షార్క్ అటాక్ కారణంగా ఆ బీచ్ లో అడుగు పెట్టడానికి స్థానికులు భయపడుతున్నారు.

టామాయో సినిమాలు

టామాయో పెర్రీ 1975లో జన్మించాడు. 12 సంవత్సరాల వయస్సులోనే ఆయన సర్ఫింగ్ చేయడం ప్రారంభించాడు. హోనోలులు ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన షైనీ ఎన్‌రైట్ మాట్లాడుతూ నార్త్ షోర్‌లో లైఫ్‌ గార్డ్‌గా పని చేసిన పెర్రీ జూలై 2016లో ఓషన్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడని తెలిపారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టామాయో సముద్ర భద్రతా లైఫ్‌గార్డ్‌ అండ్ సర్ఫింగ్ శిక్షకుడిగా పని చేశారు. ఆయన బ్లూ క్రష్’, ‘చార్లీస్ ఏంజిల్స్: ఫుల్ థ్రాటిల్’ వంటి హాలీవుడ్ సినిమాలలో తన పాత్రలతో బాగా పాపులర్ అయ్యాడు. అలాగే పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’లో కూడా కీలకపాత్రను పోషించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు