OTT Movie : కొత్త కోడలి రాక కోసం దెయ్యాల ఎదురు చూపులు… భ్రమయుగంకు మించిన మలయాళ హార్రర్ మూవీ తెలుగులో

OTT Movie : ఓటిటిలు అందుబాటులోకి వచ్చాక కేవలం రీజనల్ సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలను కూడా సొంత భాషలో లేదంటే సబ్ టైటిల్స్ తో చూసే అద్భుతమైన అవకాశం లభించింది మూవీ లవర్స్ కి. అందుకే గత కొంతకాలం నుంచి ఓటిటిలో దొరుకుతున్న కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఇక హారర్ సినిమాల సంగతి చెప్పక్కర్లేదు. అసలు భాషతో సంబంధం లేకుండా ఏ భాషలో ఉన్నా సరే చూసేస్తారు. ఈరోజు కూడా అలా చూడాలి అనిపించే ఓ హర్రర్ మూవీ మన మూవీ సజెషన్లో తెలుసుకోబోతున్నాం. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ఇటీవల కాలంలో ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్న మలయాళ భాషా సినిమా ఇది. అయితే తెలుగులో అందుబాటులో ఉండడం గుడ్ న్యూస్. మరి మూవీ ఏ ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతోంది? ఆ మూవీ టైటిల్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

సాధారణంగా హారర్ మూవీలు అనగానే హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి. అందులో భాష ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఎలాగోలా సర్దుకుపోతారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో సౌత్ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న స్టార్స్ నటించడం విశేషం. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో హీరోగా నటించగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. ప్రేక్షకులకు తెరపై ఒక వ్యక్తి పుస్తకం చదువుతూ అందులో ఉన్న కథను చూపిస్తారు. సాధారణంగానే మలయాళ సినిమా అంటే మంచి యాక్టింగ్ తో పాటు కంటెంట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇటీవల వచ్చిన భ్రమయుగం మూవీని మించేలా ఈ మూవీలో హారర్ కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా సినిమాలో భయపెట్టే సన్నివేశాలు చాలానే ఉంటాయి. పొరపాటున ధైర్యం ఎక్కువ అని ఫీల్ అయ్యి ఒంటరిగా చూసారంటే తడిసిపోవడం ఖాయం. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ పేరు కుమారి. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ అవుతోంది.

Kumari (2022) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

- Advertisement -

కథలోకి వెళ్తే…

ముందుగా హీరో ఒక బుక్ ఓపెన్ చేసి గతంలో జరిగిన కథ గురించి చదువుతాడు. ఆ కథ ప్రకారం స్టోరీ నడుస్తుండగా అందులో ఊరి గురించి చూపిస్తారు. ఆ ఊర్లోకి బయట వాళ్ళు వెళ్లాలంటే భయపడతారు. కానీ అలాంటి ఊరికి హీరోయిన్ కోడలుగా అడుగు పెడుతుంది. నిజానికి ఆమె రాక కోసమే ఆ ఊరి దేవుళ్ళు, దయ్యాలు ఎదురు చూస్తూ ఉంటాయి. హీరోయిన్ ఊర్లో అడుగు పెట్టిన క్షణం నుంచే ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి కథలో. అంతేకాకుండా ఆ ఊర్లో ఉండే రహస్యాల గురించి ఒక్కరికి కూడా పెద్దగా తెలియదు. అసలు ఆ హీరోయిన్ కోసం అక్కడున్న దయ్యాలు, దేవతలు ఎందుకు ఎదురు చూస్తున్నాయి? ఆ అమ్మాయి అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఏం జరిగింది? హీరోయిన్ కి ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న కుమారి మూవీని వీక్షించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు