Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు గుండె గుభేల్మనిపించే న్యూస్… ఇన్ని నెలలు సినిమాలకు పవర్ స్టార్ దూరం?

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అంతులేకుండా పోయింది. కానీ ఒక్క విషయం వాళ్ళను ఆందోళనకు గురి చేస్తుంది. అదే పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వకపోవడం. తాజాగా పవన్ ఫ్యాన్స్ ను మరింత టెన్షన్ పెట్టే వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే పవన్ ఏకంగా కొన్ని నెలలపాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నారట. మరి పవన్ నిజంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దాని వెనకున్న కారణం ఏంటి? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

మూడు నెలలు సినిమాలకు దూరం…

రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల సినిమాలకు కొంతకాలం పవన్ గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరమల్లు, ఓజి వంటి సినిమాలతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. ఈ సినిమాల డైరెక్టర్స్ అంతా ఎలక్షన్ తర్వాత వెంటనే పవన్ షూటింగ్ పూర్తి చేస్తాడనే నమ్మకంతో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ ఎలక్షన్స్ లో పవన్ ఘన విజయం సాధించడంతో త్వరలోనే ఆయన సెట్ లో అడుగుపెట్టే అవకాశం ఉందని తెగ సంతోష పడిపోయారు. ఎప్పుడెప్పుడు ఆయన తిరిగి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడా అని పవర్ స్టార్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే వాళ్ల వెయిటింగ్ పీరియడ్ రానురానూ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. రీసెంట్ గా పవన్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో వారంలో రెండు రోజులు షూటింగ్లకు టైం కేటాయించబోతున్నాడని వార్తలు వినిపించాయి.

Pawan Kalyan shares 1st Instagram post, gives special tribute to co-stars -  India Today

- Advertisement -

కానీ తాజా సమాచారం ప్రకారం రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత పవన్ సినిమాల నుంచి మరింత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని టాక్ నడుస్తోంది. జూలై లో తన నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని పవన్ ప్లాన్ చేశాడు. కానీ ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో వచ్చే మూడు నెలల పాటు పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాలతో బిజీ కానున్నాడని సమాచారం. అభివృద్ధిపైనే దృష్టి సారిస్తూ ఆయన ప్రజలతో మమేకం కాబోతున్నారట.

సెట్ లో కాలు పెట్టేది ఎప్పుడు ?

దీంతో ఈ న్యూస్ నిన్న పవన్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. నిజానికి ఈ ఏడాది ఓజి మూవీ రిలీజ్ అవుతుందని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. కానీ పవన్ ఇంకా షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయలేదు సరి కదా ఇంకో మూడు నెలల గ్యాప్ తీసుకుంటున్నారు అనే వార్త మెగా ఫాన్స్ ను టెన్షన్ పడుతోంది. కాగా పవన్ ఓజి షూటింగ్ ను మూడు నెలల తర్వాత తిరిగి ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయనకు సినిమా షూటింగ్లను తిరిగి ప్రారంభించే ఆలోచన లేదని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు తప్ప కొత్త సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పవన్ జూన్ 26 నుంచి 11 రోజుల పాటు వారాహి విజయదీక్ష చేపట్టబోతున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు