Ali: పూరి జగన్నాథ్ సీఎం, నేను హోమ్ మినిస్టర్, కమెడియన్ ఆలీ సంచలన కామెంట్స్

Ali: ప్రతి దర్శకుడు కథ రాయడానికి ఒక ప్రత్యేకమైన చోటుని ఎంచుకుంటారని కొందరు అంటూ ఉంటారు. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా పేరు సాధించుకున్న పూరి జగన్నాథ్ మాత్రం కథ రాయడానికి బ్యాంకాక్ వెళ్తారని చెబుతుంటారు. అయితే పూరీ జగన్నాద్ ఇదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటూ వచ్చాడు. వాస్తవానికి పూరి కథ రాసేది బ్యాంకాక్ లో కాదు. బ్యాంకాక్ లో పటాయా అనే ఒక ప్లేసులో. అక్కడ బీచ్ ఒడ్డున కూర్చుని పూరి కథ రాస్తూ, వారం రోజుల్లో డైలాగ్స్ కూడా ఫినిష్ చేస్తూ తిరిగి ఇండియాకి వచ్చేస్తుంటాడు. అక్కడ పూరి జగన్నాథ్ కి ఒక ఫ్యామిలీ కూడా మంచి సపోర్ట్ చేస్తూ సేవలు చేస్తూ ఉంటుంది.

Puri Jagannadh

ఇకపోతే పూరీ జగన్నాథ్ ప్రతి కథ అక్కడికి వెళ్లి రాయడం అలవాటుగా మారింది. అయితే చాలామంది పూరి జగన్నాథ్ అక్కడికి ఏవేవో పనులు చేస్తున్నాడు అంటే అప్పట్లో కథనాలు కూడా వినిపించేవి. డ్రగ్స్ ఫీలింగ్ అంటూ కూడా కొంతమంది వార్తలు రాశారు. ఇకపోతే వాస్తవానికి అక్కడికి వెళ్లి పూరి జగన్నాథ్ వారం రోజులు పాటు కూర్చుని కథను రాసుకొని వచ్చి ఇక్కడ ఇండియాలో సినిమాలు తీస్తుంటారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించి నిర్మించిన హార్ట్ ఎటాక్ సినిమా ఫంక్షన్ కూడా అక్కడే చేసింది చిత్ర యూనిట్.

- Advertisement -

ఇకపోతే ఆలీ పూరి జగన్నాథ్ సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తూ ఉంటాడు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమా అంటే ఆలీకి ఒక సెపరేట్ కామెడీ ట్రాక్ ఉండేది. కొన్ని సినిమాల్లో ఈ కామెడీ ట్రాక్ పెట్టినప్పుడు ఆలీ కామెడీ ఎందుకు మీరు పెట్టట్లేదు అంటూ ఎయిర్పోర్టులో పూరి జగన్నాథ్ అని చాలామంది అడిగారు. ఇకపోతే ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ అనే శంకర్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాలో అలీ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరైన అలీ. బ్యాంకాక్ లో పూరి జగన్నాథ్ నేను ఎలక్షన్స్ లో నిలుచుంటే పూరి జగన్నాథ్ అక్కడ సీఎం అవుతారు నేను హోమ్ మినిస్టర్ అవుతానంటూ కామెడీగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు