Nani New Movies : నాని రెండు పడవల ప్రయాణం… ఆ రెండు సినిమాలు ఒకేసారి చేస్తాడా?

Nani New Movies : నేచురల్ స్టార్ నాని నెమ్మదిగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక బ్రాండ్ ను బిల్డ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా కాస్త స్లోగా ఉన్న నాని త్వరలోనే స్పీడు పెంచబోతున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగానే ఒకేసారి రెండు సినిమాల్లో నటించబోతున్నాడని టాక్ నడుస్తోంది.

నాని రెండు పడవల ప్రయాణం…

నాని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి యూఎస్ఏలో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. జూలైలో ఇండియాకు తిరిగి రాబోతున్న నాని వెంటనే సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు. ఆగస్టు 29న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే నాని నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనే విషయంపై ఆయన అభిమానులకు ఏమాత్రం క్లారిటీ లేదు. ఇప్పటిదాకా ఆయన ఒప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చిన సినిమాలు కొన్ని పక్కకు పెట్టేసాడు అని రూమర్లు విన్పిస్తున్నాయి. దీంతో నాని నెక్స్ట్ సినిమా విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం నాని నెక్స్ట్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

Nani film with Sujeeth shelved?

- Advertisement -

నాని తన లైనప్ లో ఉన్న సినిమాలలో హిట్ 3 మూవీని ముందుగా స్టార్ట్ చేయబోతున్నారట. ఈ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. హిట్ 3తో పాటే నాని శ్రీకాంత్ ఓదెల సినిమా షూటింగ్ లో కూడా ఒకేసారి పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయ్యాక హిట్ 3 షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. అలాగే ఈ ఏడాది చివర్లో శ్రీకాంత్ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టి, ఒకేసారి రెండు సినిమాలతో బిజీగా మారబోతున్నాడని తెలుస్తోంది.

నానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్

ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే నానికి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎదురు కాబోతోంది. అదేంటంటే లుక్. హిట్ 3 కోసం నాని ఒక లుక్ లో కనిపిస్తే, శ్రీకాంత్ ఓదెల సినిమా కోసం మరో లుక్ లో కనిపించాల్సి ఉంటుంది. అంటే ఒకేసారి రెండు డిఫరెంట్ లుక్స్ ను ఆయన ఎలా మెయింటైన్ చేస్తాడు అన్నదే ఇప్పుడు ప్రశ్న. అలాగే హిట్ 3 మూవీని దేశంలోని పలు డిఫరెంట్ లొకేషన్ లలో చిత్రీకరించాల్సి ఉంది.. 20 రోజులు ఈ మూవీ కోసం నాని డేట్స్ ఇచ్చాడు. ఇక శ్రీకాంత్ సినిమా కోసం నాని 200 రోజులు కేటాయించాల్సి ఉంది. అందుకే నాని రెండు సినిమాల షూటింగ్లను ఒకేసారి చేపట్టే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన ఈ రెండు సినిమాలను 2025 లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. హిట్ 3 మూవీని నాని స్వయంగా నిర్మిస్తుండగా, శ్రీకాంత్ మూవీకి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి పెద్దగా గ్యాప్ లేకుండా నాని వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాడన్న మాట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు