Maharaja Collections: రూ.100 కోట్ల క్లబ్ లో “మహారాజా”గా దూసుకుపోతున్న విజయ్ సేతుపతి..!

Maharaja Collections: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తాజాగా మహారాజా సినిమాకి ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామా కథాంశం తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విలన్ గా కనిపించే ఈయన.. ఈసారి సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఆడియన్స్ ను మరింత కట్టిపడేసింది అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రముఖ డైరెక్టర్ నితిన్ సామినాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా జూన్ 14వ తేదీన శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. తొలి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా.. కలెక్షన్ల పరంగా కూడా సునామీ సృష్టిస్తోంది.

తొలి రోజు నుంచే భారీ కలెక్షన్స్..

Maharaja Collections: Vijay Sethupathi is emerging as a Maharaja in the Rs.100 crore club..!
Maharaja Collections: Vijay Sethupathi is emerging as a Maharaja in the Rs.100 crore club..!

ఇకపోతే విజయ్ సేతుపతి తాజాగా నటించిన ఈ మహారాజు చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. బాక్సాఫీస్ ట్రాకర్ ప్రకారం తొలి రోజు నుంచే కలెక్షన్స్ వసూలు కురిపిస్తున్న ఈ సినిమా …తొలిరోజు రూ.8 కోట్లు వసూలు చేయగా.. రెండవ రోజు రూ.10.5 కోట్లు వసూలు చేయగా.. మూడవ రోజు రూ.12 కోట్లు రాబట్టింది. వసూలు చేసి ఇలా వారం మొత్తం మీద ఏకంగా రూ.40 కోట్లు గ్రాస్ కలెక్షన్లతో రికార్డు సృష్టించింది.. మహారాజా సినిమాకి గతవారం రోజుల్లో ఏ రేంజ్ లో అయితే కలెక్షన్లు సాధించిందో ఇప్పుడు రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ జోరు కొనసాగిస్తోంది.. క్రైమ్, థ్రిల్లర్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ జోడించి.. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తోనే సినిమాని తెరకెక్కించారు.. ఇక ఆశించిన దానికంటే రెట్టింపు స్థాయిలో భారీ విజయాన్ని అందించడమే కాదు అంతకుమించి కలెక్షన్లు కూడా అందిస్తోంది ఈ సినిమా..

రూ.100 కోట్ల క్లబ్ లో మహారాజా..

మొత్తం దాదాపు 1200 స్క్రీన్ లు ఈ సినిమాకి కేటాయించారు.. ఈ క్రమంలోనే ప్రతి థియేటర్లో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రూ.100 కోట్ల క్లబ్లో చేరబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తొలి రోజు నుంచి మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటివరకు రూ.85.3 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం.. ఇక రెండు మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మొత్తానికి అయితే విజయ్ సేతుపతి మహారాజా గా రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టబోతున్నారు అని చెప్పవచ్చు. మొత్తానికి అయితే విజయ్ సేతుపతి 50వ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.. ఇక ఈ సినిమా విజయ్ సేతుపతి కెరియర్ లో 50వ సినిమా మైలురాయిగా నిలవబోతోందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు