Rashmika Mandhana: కమిటీ కుర్రాళ్లకు రష్మిక అదిరిపోయే ట్రీట్ !

Rashmika Mandhana: స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. మొదట కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్న రష్మిక మందన్న ఆ సినిమా అనంతరం కన్నడలో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది.

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. అయితే తాజాగా రష్మిక….”కమిటీ కుర్రాళ్ళు” సినిమాకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతుంది. ఇదిలా ఉండగా…. మెగా డాటర్ నిహారిక కొనిదెలా గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాకు నిహారిక యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ప్రస్తుతం సినిమాల నుంచి తప్పుకొని ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. ఇక విడాకుల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నిహారిక కొణిదెల యాక్టింగ్ పై ఫోకస్ పెడుతునే మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు చేస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే పేరుతో సొంతంగా ఓ బ్యానర్ ను స్థాపించింది. ఈ బ్యానర్ లో ఇప్పటివరకు వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే చేశారు. ఇక ఫస్ట్ టైం కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథాంశంతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కమిటీ కుర్రాళ్ళు అనే టైటిల్ ఖరారు చేశారు.

- Advertisement -

Image

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ శ్రీ రాధా దామోదర్ స్టూడియో బ్యానర్లపై నిహారిక కొణిదెల సమర్పణలో కమిటీ కుర్రాళ్ళు అనే చిత్రాన్ని నిర్మించారు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. ఈ చిత్రానికి ఎదు వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇది ఇలా ఉండగా ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమాకు హీరోయిన్ రష్మిక మందాన… తన సహాయం అందించబోతుంది. ఈ సినిమా మూడవ సింగిల్ ను రష్మిక రిలీజ్ చేయబోతుంది. ప్రేమ గారడి అంటూ సాగే పాటను రష్మిక మందన ఇవాళ సాయంత్రం 6:48 గంటలకు రిలీజ్ చేయబోతుంది. ఈ మేరకు చిత్ర బృందం అదిరిపోయే పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు