Nag Ashwin : నాగి ఇంతమంది డైరెక్టర్ల దగ్గర పని చేశాడా? ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?

Nag Ashwin : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడం అనేది అంత ఈజీ కాదు. కొంత మందికి పదుల, వందల సినిమాలు చేసినప్పటికీ లక్ కలిసి రాదు. కానీ నాగ్ అశ్విన్ తీరే వేరు. చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ ఆయన పేరు పాన్ వరల్డ్ రేంజ్ లో మార్మోగేలా ప్లాన్ చేసుకున్నారు. కల్కి 2898 ఏడీ మూవీతో మరికొన్ని గంటలలో థియేటర్లలోకి రాబోతున్న ఈ స్టార్ డైరెక్టర్ మొదటి సంపాదన ఎంతో తెలుసా ? అంతేకాదు ఆయన ఎంత మంది డైరెక్టర్ల దగ్గర పని చేశారో తెలుసా ? కల్కి రిలీజ్ సందర్భంగా నాగ్ అశ్విన్ కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ పర్సనల్ విషయాలను తెలుసుకుందాం.

అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయాణం…

నాగ్ అశ్విన్ చిన్నప్పుడే పలు ఇంట్రెస్టింగ్ స్టోరీలు రాసేవారట. ఒకానొక సందర్భంలో స్కూల్ ఆవరణలో ఎవరో చెట్లు నరికేస్తుంటే చూసి ప్రకృతిని ఎవరు నాశనం చేస్తున్నారు అనే స్టోరీ రాసి స్కూల్ ప్రిన్సిపల్ చేత తిట్లు తిన్నారట. కాగా నాగీ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు కావడం విశేషం. ఆయన తండ్రి పేరు జయరాం రెడ్డి, తల్లి జయంతి. ఇక స్కూల్ చదువు ఫినిష్ చేసిన నాగి మణిపాల్ యూనివర్సిటీలో మల్టీ మీడియా కోర్స్ లో చేరారు. అక్కడే ఆయన వీడియో ఎడిటింగ్ పై పట్టు సాధించి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి రెడీ అయ్యారు. తల్లిదండ్రుల ఫుల్ సపోర్ట్ తో డైరెక్టర్ శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు.

Real Inspiration Of Nag Ashwin Behind Kalki 2898 AD Characters |  cinejosh.com

- Advertisement -

నాగీ ఫస్ట్ శాలరీ ఎంతంటే?

అయితే అప్పటికి శేఖర్ కమ్ముల గోదావరి సినిమాను తీస్తుండడంతో నెక్స్ట్ సినిమాలో కలిసి పని చేద్దామని హామీ ఇచ్చారట. అంతలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకు అని మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా సినిమాకు పని చేశారట నాగి. ఈ మూవీతోనే ఆయన మొట్టమొదటి శాలరీ అందుకున్నారు. నాగ్ అశ్విన్ మొదటి జీతం రూ. 4000.

ఇంతమంది డైరెక్టర్స్ దగ్గర పని

ఆ తర్వాత నాగి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అలా మొత్తానికి ఇండస్ట్రీలో ఇద్దరు డైరెక్టర్స్ దగ్గర నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఒకటి శేఖర్ కమ్ముల, రెండు నేను మీకు తెలుసా మూవీ డైరెక్టర్ అజయ్ శాస్త్రి. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో డైరెక్టర్ గా ప్రయాణం మొదలు పెట్టిన నాగీ రెండవ సినిమా మహానటితోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు కల్కి మూవీతో పాన్ వరల్డ్ స్థాయిలో సంచలనం సృష్టించడానికి రెడీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. మొదటి రోజే ఈ మూవీ 200 కోట్లకు పైగా కొల్లగొడుతుందనే అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు