Nani : ‘కల్కి’ లో ఆ పాత్రలో నాని.. ఇదేం ట్విస్ట్ నాగి మామా..

Nani : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజ్ కాబోతుంది.. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటికే సినిమా ప్రీమియర్ షోలు కూడా మొదలయ్యినట్లు తెలుస్తుంది… తెలుగు రాష్ట్రాల్లో డార్లింగ్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద హంగామా మొదలెట్టేశారు.. ఇలాంటి సమయంలో సినిమా పై క్యూరియాసిటీ పెంచేందుకు మరో క్రేజీ అప్డేట్ ను వదిలారు..

ఈ మూవీ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ జానర్‌గా రూపొందించబడింది.. ఈ సినిమా కథ కాస్త కొత్తగా ఉన్నా జనాలను ఆకట్టుకుంటుందని ఇప్పటివరకు విడుదలైన టీజర్స్ , ట్రైలర్స్ ను చూస్తే అర్థం అవుతుంది.. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పాడుకొనే , మాళవిక నాయర్ , రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో చాలా మంది ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారని గతంలో వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ సినిమాలో భాగం అయ్యాడని తెలుస్తుంది. అభిమన్యుడు పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు..

Nani is the hero who will be seen in the role of Abhimanyu in Kalki
Nani is the hero who will be seen in the role of Abhimanyu in Kalki

హీరో నాని కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. నానితో నాగి ఎవడె సుభ్రమణ్యం సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రంలో నాని అభిమన్యుడు అనే పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నాడు.. ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్ , నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. సినిమాలో వీరిద్దరికి స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను 600 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతదర్శకుడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు