Suspense Crime Thriller on OTT: తెలుగులోనే ఈ బెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్… రష్మీ కోసమైనా చూడాల్సిందే

Suspense Crime Thriller on OTT : ఓటిటిలకు పాపులారిటీ పెరిగిన తర్వాత కంటెంట్ బాగుండే చిన్న సినిమాలకు ఆదరణ కూడా అదే రేంజ్ లో దక్కుతోంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఓటిటిలో మాత్రం కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ లో యూత్ ఫుల్ కంటెంట్ తో పాటు మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా నటించడం విశేషం. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? ఆ మూవీ టైటిల్ ఏంటి ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహాలో అందుబాటులో…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది ఓ తెలుగు మూవీ గురించి. ఇక తెలుగు మూవీ అనగానే గుర్తుకొచ్చే ఓటిటి ప్లాట్ఫామ్ ఆహా. ఈ మూవీ కూడా ఇందులోనే స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ పేరు బాయ్స్ హాస్టల్. ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించగా రిషబ్ శెట్టి, తరుణ్ భాస్కర్, రష్మి గౌతమ్ గెస్ట్ రోల్స్ లో మెరిసారు. అయితే నిజానికి ఈ మూవీ కన్నడ మూవీ నుంచి రీమేక్ అయ్యింది. కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన హాస్టల్ హుడగరు బేకాగిద్దారే అనే మూవీని తెలుగులో హాస్టల్ బాయ్స్ పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీ ఓటిటీలోకి వచ్చి చాలా రోజులు అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ చూసే ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా యూత్ ఫుల్ సినిమాలను క్రేజీగా ఇష్టపడే మూవీ లవర్స్ మిస్ అయితే వెంటనే ఒక లుక్ వేసేయండి.

Boys Hostel Telugu Movie Review - One-Of-A-Kind Crazy Ride

- Advertisement -

కథలోకి వెళ్తే…

సినిమాలో హీరో డైరెక్టర్ కావాలని ఆశపడతాడు. అతని పేరు అజిత్. అతను తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ హాస్టల్ లో ఉంటాడు. కానీ కథలు సరిగ్గా రాయట్లేదు అంటూ అతని ఫ్రెండ్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు అజిత్ బ్యాచ్ కు, వార్డెన్ కు పడదు. అయితే సడన్ గా ఓ రోజు వార్డెన్ తన చావుకి అజిత్ అతని ఫ్రెండ్సే కారణం అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి చనిపోతాడు. దీంతో ఈ కేసులో ఇరుక్కుంటామేమో అనే భయంతో ఆ డెడ్ బాడీని మాయం చేయాలని డిసైడ్ అవుతారు. మరి వార్డెన్ ఎందుకు చనిపోయాడు ? వార్డెన్ చావుతో అజిత్ గ్యాంగ్ కి ఏంటి సంబంధం ? ఇందులో రష్మి గౌతమ్ రోల్ ఏంటి అసలు ? డైరెక్టర్ కావాలన్న హీరో కల నెరవేరిందా ? అనే డౌట్స్ క్లారిటీ కావాలంటే ఈ మూవీని చూసి తీరాల్సిందే. కాలేజ్ లైఫ్, బ్యాచిలర్ లైఫ్ ఇలాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. అంతేకాదు రష్మి గౌతమ్ ఈ సినిమాలో గ్లామర్ లవర్స్ కోసం కావలసినంత అందాలను ఆరబోసింది. ఒక్క సారి రష్మి కోసమైనా ఈ సినిమాను చూడవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు