Kalki2898AD : కల్కి కోసం ఐదు కాదు.. ఏకంగా ఆరు.. ఇక అల్ టైం రికార్డ్ గ్యారెంటీ!

Kalki2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకి ఇంకా ఒక్కరోజే మిగిలుంది. తెల్లారితే తెలుగు రాష్ట్రాల థియేటర్లు భారీగా మూవీ లవర్స్ తో కిటకిటలాడుతాయి. దేని కోసమో తెలిసిందేగా. పాన్ ఇండియా వైడ్ గా ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కిన కల్కి2898AD ఎట్టకేలకు థియేటర్లలో జూన్27న అంటే రేపు విడుదల కానుంది. పాన్ ఇండియా వైడ్ గానే కాకుండా వరల్డ్ వైడ్ గాను పలు చోట్ల కల్కి మూవీ రికార్డులు బద్దలు కొడుతుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది కల్కి అనే చెప్పాలి. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో సహా, కామన్ ఆడియన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కల్కి మేకర్స్ తమ ప్రమోషన్లతో మూవీపై పాన్ ఇండియా వైడ్ గా అటెన్షన్ వచ్చేలా చేసారు. ఇప్పటివరకూ కల్కి నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు, అలాగే సినిమా సాంగ్స్ అన్నీ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అంటూ ఆసక్తి పెరిగేలా చేసాయి. ఇక కల్కి ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా మేకర్స్, నటీనటులు ఈ సినిమా గురించి మాట్లాడిన తీరు కూడా ఓ రేంజ్ అంచనాలని పెంచేసాయి. ఇక పాన్ ఇండియా వైడ్ గా బుకింగ్స్ సంగతి పక్కన బెడితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అభిమానులకు క్రేజీ న్యూస్ వచ్చింది.

Kalki2898AD movie allowed for 6 shows in Telugu states

కల్కికి ఏకంగా 6 షోలు..

కల్కి2898AD సినిమా ఇప్పటికే బుకింగ్స్ ద్వారా చాలా రికార్డులు నెలకొల్పగా, తెలుగు రాష్ట్రాల్లో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ మార్క్ దాటిపోయింది. ఇక ఇప్పడు కల్కి (Kalki2898AD) గురించి ఫ్యాన్స్ కి మరింత కిక్కిచ్చే అప్డేట్ వచ్చింది. కల్కి సినిమాకి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్, అలాగే తెలంగాణ లో ఇంతకు ముందు 5 షోల పర్మిషన్ ఆల్రెడీ రాగా, ఇప్పుడు ఏకంగా 6 షోలకు పర్మిషన్ ఇచ్చేసారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఆల్రెడీ అనుమతి జారీ చేయగా, థియేటర్ల వద్ద ఆరో షో బుకింగ్స్ కూడా ఓపెన్ చేసేసారు. దీంతో కల్కి తెలుగు రాష్ట్రాల్లో అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం గ్యారెంటీ గా ఉంది. ఖచ్చితంగా RRR రికార్డులను తెలుగు స్టేట్స్ లో బ్రేక్ చేయడం ఖాయంగా ఉంది.

- Advertisement -

చిత్ర నిర్మాతల విజ్ఞప్తి మేరకు..

ఇక కల్కి2898AD సినిమాకు రేపు ఉదయం 4.30 నిమిషాల నుండి 8 గంటల లోపు అన్ని థియేటర్లలో కల్కి షో ని వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారట. చిత్ర నిర్మాతల విజ్ఞప్తి మేరకు థియేటర్ల వద్ద భారీ రద్దీ, బ్లాక్ మార్కెటింగ్ ని అరికట్టేందుకు ఈ నిర్ణయాలు తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఇక కల్కి సినిమాపై ఇప్పటికే స్కై లెవెల్లో అంచనాలు నెలకొని ఉండగా, సినిమా స్టార్ కాస్టింగ్ కూడా ఊహించని రేంజ్ లో ఉండడంతో అన్ని ఇండస్ట్రీ లలో కూడా భారీ ఓపెనింగ్స్ ఖాయమని చెప్పొచ్చు. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే రికార్డుల జాతర సృష్టిస్తుండగా, RRR ప్రీమియర్స్ రికార్డులని ఇప్పటికే బ్రేక్ చేసేసింది. ఇక కల్కి లో ప్రభాస్ సహా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని, బ్రహ్మానందం, దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, ఈ స్టార్ కాస్ట్ ని స్క్రీన్ పై చూడ్డానికి వారి వారి అభిమానులు ఎంతో ఆత్రుత తో ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు