Upasana – Ram Charan: మెగా కపుల్ మధ్య ఆస్తి వివాదాలు.. ఉపాసన ఏం చేసిందంటే..?

Upasana – Ram Charan.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో ఉపాసన – రాంచరణ్ జంట కూడా ఒకటి.. ఈ జంటను చూస్తే ముచ్చటేస్తుంది.. ఎక్కడికి వెళ్ళినా సరే జంటగా వెళుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఇప్పటికే వివాహం జరిగి..12 సంవత్సరాలు గడుస్తున్నా. ఒకరికొకరు జీవితంలో అండగా నిలుచుకుంటూ తోడుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఏడాది పండంటి కూతురికి జన్మనిచ్చిన ఈ జంట ఈ ఏడాది పుట్టినరోజును కూడా ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

ఉపాసన – రాంచరణ్ మధ్య గొడవలు…

Upasana - Ram Charan: Property disputes between the mega couple.. What did Upasana do..?
Upasana – Ram Charan: Property disputes between the mega couple.. What did Upasana do..?

ఇంతటి అన్యోన్యంగా ఉండే ఈ జంట గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు ఉపాసన ఇటు రాంచరణ్ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయనేఒక వార్త మెగా అభిమానులకు మింగుడు పడడం లేదు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేలకోట్ల ఆస్తులు ఉండే వీళ్ళ మధ్య ఆస్తి తగాదాలు ఏంటి? అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఆస్తి కోసమే తగాదాలు..

తాజాగా వీరిద్దరి మధ్య ఆస్తులకు సంబంధించిన గొడవ మొదలైందనే ఒక గాసిప్ నెట్టింట హల్చల్ చేస్తోంది. దంపతులిద్దరిలో ఆస్తులు ఎవరికి ఎక్కువ ఉన్నాయనే విషయంలో సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా.. ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగిందట. దీంతో వీరిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.తమలో ఇద్దరి పేరు మీద సమానంగా కాకుండా ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంటే వారు ఆ ఎక్స్ట్రా ప్రాపర్టీని తమ గారాల పట్టి క్లీంకారా పేరు మీద ఒక సెపరేట్ అకౌంట్ తీసి అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలని ఆలోచన చేసినట్లు సమాచారం.. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ఈ విషయాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

ప్రాపర్టీ కూతురు పేరు మీద..

ఉపాసన – రాంచరణ్ ప్రాపర్టీ విషయానికి వస్తే. ఇండియాలోనే అత్యంత ధనిక సెలబ్రిటీ జంటలలో వీరు కూడా ఒకటి.. ఈ స్టార్ కపుల్ పేరు మీద ఇద్దరికీ కలిపి ఇప్పటికిప్పుడు రూ.2,500 కోట్లకు పైగానే ఆస్తి ఉంటుందని సమాచారం. ఇక వ్యక్తిగతంగా చూసుకుంటే రామ్ చరణ్ పేరు మీద రూ.1000 కోట్ల ఆస్తి , ఉపాసన పేరు మీద రూ.1130 కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం. అంటే రామ్ చరణ్ కంటే ఉపాసన వ్యక్తిగత ప్రాపర్టీ రూ.130 కోట్లు అధికంగా ఉంది. ఇక ఇద్దరికీ సమాన ఆస్తి ఉండాలి అంటే తన పేరు మీద ఉన్న అదనపు ఆస్తి రూ.130 కోట్లను ఉపాసన తన కూతురు క్లీంకార పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది.

అన్నయ్యను దబాయిస్తున్న వదినమ్మ..

అయితే ఈ తగాదాలు జరిగిన నేపథ్యం లో ఉపాసన ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అదనపు ఆస్తి తన కూతురు పేరు మీద ఆమె రాయలేదట. తన పేరు మీద ఉన్నా .. తన కూతురు పేరు మీద ఉన్నా.. ఒకటేనని రామ్ చరణ్ ను దబాయిస్తోందట. దీంతో వదినమ్మ అన్నయ్య కంటే కాస్త పై స్థాయిలో ఉండాలని.. అలా చేస్తుందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ క్యూట్ జంట గురించి ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు